కేసీఆర్! నీ ఫ్యామిలీ ఆస్తులెంత? 4 లక్షల కోట్ల అప్పుల ధనిక రాష్ట్రమా?: ఐఆర్ఎస్ పెట్టుకో అంటూ బండి

మహబూబ్‌నగర్: టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. సాధారణంగా ప్లీనరీల్లో పార్టీ ఇచ్చే హామీలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారని, టీఆర్ఎస్ ప్లీనరీలో మాత్రం కేంద్రం, బీజేపీనే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూరులో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

రూ. 4 లక్షలు అప్పులు చేసి ధనిక రాష్ట్రమా?: కేసీఆర్‌పై బండి

రూ. 4 లక్షలు అప్పులు చేసి ధనిక రాష్ట్రమా?: కేసీఆర్‌పై బండి


ప్లీనరీలో బీజేపీ నేతలను కేసీఆర్ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని టీఆర్ఎస్ నేతలు గందరగోళం చేశారన్నారు. రూ. 4 లక్షల కోట్ల అప్పులున్న తెలంగాణ ధనిక రాష్ట్రమా? అని బండి సంజయ్ నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. కేసీఆర్ కుటుంబమే సంపాదించుకుందని విమర్శించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో రోజుకో మాట చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.

కేసీఆర్ నీ, నీ కుటుంబ ఆస్తులంత?: బండి సంజయ్ నిలదీత

కేసీఆర్ నీ, నీ కుటుంబ ఆస్తులంత?: బండి సంజయ్ నిలదీత

పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ తన కుటుంబం ఆస్తులను ఎందుకు ప్రకటించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటే విమర్శలు చేస్తారా? అని బండి సంజయ్ బండి పడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించకుండా కేంద్రంపైనే ఆరోపణలా? అని మండిపడ్డారు. మహిళలను గౌరవించే సంస్కారం లేని పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు. టీఆర్ఎస్ ఆస్తులు వెయ్యి కోట్లు అని చెప్పారని.. మరి కేసీఆర్ ఆస్తులెంత? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీని తిట్టడానికే టీఆర్ఎస్ ప్లీనరీనా? హామీల అమలేది కేసీఆర్?: బండి

బీజేపీని తిట్టడానికే టీఆర్ఎస్ ప్లీనరీనా? హామీల అమలేది కేసీఆర్?: బండి

కేంద్రాన్ని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని బండి సంజయ్ మండిపడ్డారు. 2014ఎన్నికల మానిఫెస్టోలోని హామీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు బండి సంజయ్. నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, దళితులకు మూడెకరాలు భూమి ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. దళిత సీఎం హామీ ఏమైందని సంజయ్ ప్రశ్నించారు. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు మీ ఆస్తులు ఎన్ని..ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జమానా.. అవినీతి ఖజానా అని తెలంగాణ ప్రజలు ఘోషిస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ కాకపోతే ఐఆర్ఎస్ పెట్టుకోమంటూ బండి ఫైర్

బీఆర్ఎస్ కాకపోతే ఐఆర్ఎస్ పెట్టుకోమంటూ బండి ఫైర్

టీఆర్ఎస్ పార్టీకి 21ఏళ్లు పూర్తైన సందర్భంగా తాను అడిగే 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. దేశానికే క్యాన్సర్‌గా మారిన మజ్లిస్‌ను పక్కన పెట్టుకున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిందన్న ఆయన.. కేసీఆర్ మాత్రం దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారని బండి సంజయ్ మండిపడ్డారు. తన కుమారుడికి పట్టాభిషేకం చేసేందుకు ఆయన యత్నిస్తున్నారు. బీఆర్ఎస్(భారతీయ రాష్ట్ర సమితి)కాకపోతే.. అంతర్జాతీయ రాష్ట్ర సమతి(ఐఆర్ఎస్) పెట్టుకోండి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+