బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ మోసం..: కరీంనగర్ అభ్యర్థి లేరంటూ బండి సంజయ్

సిరిసిల్ల: బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఐదేళ్లలో రూ. 12 వేల కోట్ల నిధులు తెచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు.

కరోనా సమయంలో బీజేపీ నాయకులు ప్రజలకు అనేక సేవలు అందించారన్నారు బండి సంజయ్. ఇలా సేవలు చేస్తూ 8మంది కార్యకర్తలు మరణించారని చెప్పారు. కానీ, అప్పుడు బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నేతలు కనీసం బయటకు రాలేదని విమర్శించారు. బీఆర్​ఎస్​ లాగే కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తుందని విమర్శించారు.

bandi sanjay hits out at congress and brs in sircilla election campaign

కరీంనగర్‌​లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌​కు అభ్యర్థులు కూడా కరువయ్యారని బండి సంజయ్​ వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్​, రైతులను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని పోరాటం చేసింది తామే అని బండి సంజయ్ గుర్తు చేశారు.

అంతకముందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరులో బండి సంజయ్ పర్యటించారు. కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. పార్టీలు, కులాలకు అతీతంగా జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయిపాపన్న పేరు పెడితే హర్షిస్తామని, అయినా ఆ పని ఎందుకు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

తమ కార్యకర్తలు రాముని గుడి కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణలో రామ రాజ్యం రావాలని చెప్పారు. రాముని పేరు చెప్పి ఉంటాం కానీ ఓట్ల కోసం మాత్రం కాదు, భక్తితో చెప్పి ఉంటాం. మేము రాముని పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదు. కానీ అవతలివారు రాముని పేరు చెప్పగానే భయపడుతున్నారని బండిసంజయ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఎవరి అకౌంట్‌​లో అయినా 2500 రుపాయలు పడ్డాయా? ఆరు గ్యారంటీలు అనగానే ఓట్లన్నీ అటే వేశారు. ఇళ్లు కట్టుకోడానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. ప్రజల దగ్గరి నుంచి గుంజుకోకపోతే చాలు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్​ వాళ్లు కేసులు పెట్టింది మా పైన, జైలుకు వెళ్లింది మేము. కానీ, మీరు ఓట్లు వేసింది మాత్రం కాంగ్రెస్​ వాళ్లకు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ తప్పు చేయవద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+