పేపర్ల లీకేజీ సూత్రధారి బండి సంజయ్: సంచలన విషయాలు చెప్పిన వరంగల్ సీపీ

పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను ఏ1 గా పేర్కొంటూ, ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్ర చేసింది బండి సంజయ్ అని వెల్లడించారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్. బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.

బండి సంజయ్ కు ప్రశాంత్ మధ్య లింక్: పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ1 గా బండి సంజయ్ ను, ఏ2గా బూరం ప్రశాంత్ ను, ఏ3గా మహేష్ ను, ఏ 4 గా శివ గణేష్ ను, ఏ 5 గా మైనర్ బాలుడు ఎవరైతే పాఠశాల నుంచి ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకువచ్చాడో అతను ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. బూరం ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలామందికి ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ లో పంపించాడని, గుండెబోయిన మహేష్ కూడా ప్రశ్నాపత్రాన్ని చాలామందికి పంపించారని పేర్కొన్నారు. బూరం ప్రశాంత్ ప్రశ్నాపత్రాన్ని ఈటల రాజేందర్ కు పంపించారని, మొన్న సాయంత్రం బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడని, ప్రశాంత్ చాటింగ్ లో పేర్కొన్న అంశాలను బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడని తెలిపారు.

Bandi Sanjay is the mastermind of paper leak: Warangal CP said sensational things

నమో టీంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంత్ పని చేస్తున్నాడు
అంతకు ముందు రోజు వాట్స్అప్ కాల్ లో బండి సంజయ్ తో ప్రశాంత్ మాట్లాడాడని, అయితే బండి సంజయ్ తన వద్ద ఫోను లేదని చెప్తున్నారని, ఆయన ఫోన్ ఇస్తే కీలక సమాచారం వస్తుందని వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. ఇంకా కాల్ డేటా రావాల్సి ఉందని పేర్కొన్న ఆయన, వాట్సప్ చాటింగ్ కు సంబంధించిన డేటా కూడా ఇంకా రావాలని తెలిపారు. కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే ఫేస్బుక్ చేయలేదని బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడన్నారు.

బండి సంజయ్ నేరం ఒప్పుకున్నారు : కమలాపూర్ లోనే ఎందుకు పేపర్లు లీక్ అవుతున్నాయని ఆరా తీశామని పేర్కొన్న సిపి, ముందుగా మాట్లాడుకుని గేమ్ ప్లాన్ ప్రకారం కమలాపూర్ నుండి లీక్ చేస్తున్నారన్నారు. పేపర్ లీకేజీ యాదృచ్ఛికంగా జరగలేదని, పక్క ప్లాన్ ప్రకారం జరిగిందన్నారు. 41సీఆర్పీ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చని, పార్లమెంట్ స్పీకర్ కు కూడా సమాచారం ఇచ్చాము, అరెస్ట్ వివరాలు తెలిపామన్నారు. పక్కా లీగల్ ప్రాసెస్ చేస్తున్నాం, రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదన్నారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని, అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని తెలిపారు.

పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ఈటల రాజేందర్ పేరు : ఇక లీకైన ప్రశ్న పత్రం మహేష్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ ఇతర బిజెపి నేతలకు ఫార్వర్డ్ చేశాడని, అయితే వారందరిని అరెస్టు చేయడం లేదన్నారు. లీకేజీలకు ముందు జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకునే కేసులు పెట్టామని, ఎవరినీ ఈ కేసులో అనవసరంగా ఇరికించే ఉద్దేశం తమకు లేదన్నారు వరంగల్ సిపి ఏవి రంగనాథ్. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కి సూత్రధారి బండి సంజయ్ అని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+