ఐనా మారలే: బూతుభాషా కోవిదుడంటూ కేసీఆర్‌ను ఏకిపారేసిన బండి సంజయ్, అన్నింటికీ కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సోమవారం బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ బహుభాషా కోవిదుడు కాదు.. బూతుభాషా కోవిదుడు.. ఆయన ఏ భాషలోనైనా తిట్టగలడు చురకలంటించారు. దేశ సార్వభౌమాధికారాన్ని కించపరిచిన సీఎం కేసీఆర్.. దేశాన్నీ రక్షించే సైనికులను హేళన చేశారని మండిపడ్డారు. ఇ:దుకు దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

రైతులు ఎక్కడ కార్లలో తిరుగుతున్నారు కేసీఆర్?: బండి సంజయ్
అబద్ధాల కోసమే ప్లీనరీలు, బహిరంగ సభలు, మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నారంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. రైతులకు ఎక్కడ రుణమాఫీ చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మూడళ్లవుతున్నా రుణమాఫీ లేదు. రైతులు ఎక్కడ కార్లలో తిరుగుతున్నారో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒకసారి వరి.. ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను ఆగం చేశారని కేసీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.

ఐనా కేసీఆర్?.. బూతుభాషా కోవిదుడంటూ బండి సంజయ్ సెటైర్లు
కేసీఆర్ అంకుల్‌కి కోపమొచ్చింది. మమ్మల్ని తిట్టుకుంటూ కేసీఆర్ బాగా ఎంజాయ్ చేశాడు. కేసీఆర్ బహుభాషా కోవిదుడు కాదు.. బూతుభాషా కోవిదుడు. ఆయన ఏ భాషలోనైనా తిట్టగలడు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. హుజురాబాద్ ఓటమి తర్వాత కూడా కేసీఆర్‌లో మార్పు రాలేదని మండిపడ్డారు.
కేసీఆర్ నిన్న గంటపాటు అబద్ధాలు చెప్పారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని కేసీఆర్ చెప్పారు.. ఆ మేరకు ఎక్కడ సాగు చేశారో కేసీఆర్ చెప్పాలన్నారు. నిపుణులతో హెలికాప్టర్‌లో పరిశీలిద్దామా? అని ప్రశ్నించారు. కేంద్రం పనిలేదు.. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజా తానే కొంటానని కేసీఆర్ చెప్పలేదా? అని ప్రశ్నించారు బండి సంజయ్. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని కేసీఆర్ చెప్పదలచుకున్నారా? ఇన్నాళ్లూ అబద్ధాలు చెప్పానని ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలి. వానా కాలం పంట కొంటామని కేంద్రం చెప్పలేదని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు.

కేంద్రం కొంటామని చెప్పినా.. కేసీఆర్ అబద్ధాలు: బండి సంజయ్
ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి లేఖ వచ్చిందని, అక్టోబర్ 21 నుంచి జనవరి 20 వరకు పంట కొంటామని కేంద్రం చెప్పిందని బండి సంజయ్ తెలిపారు. మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని ఎక్కడైనా లేఖలో ఉందా? అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని అందులో ఎక్కడైనా చెప్పారా? అని నిలదీశారు. ఎఫ్ సీఐ లేఖ అందలేదని చెబితే.. తాను పంపుతానని సంజయ్ అన్నారు. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తామంటే రైతులే తరిమికొడతారని అన్నారు. ఢిల్లీకి వెళ్తానని గతంలోనూ కేసీఆర్ హడావుడి చేశారన్నారు.

తెలంగాణలో వ్యాట్ పెంచారు, జీఎస్టీలోకి పెట్రోల్ అంటే.. కేసీఆర్ ఒప్పుకోలేదు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ అబద్ధాలు చెప్పారని, 2015లో పెట్రోల్‌పై రూ. 4 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంచలేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పవచ్చా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిని కేసీఆర్ దిగజార్చారని ధ్వజమెత్తారు. అబద్ధాల కోసమే ఒక శాఖ పెట్టుకున్నారని, దాని బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. లీటర్‌పై కేంద్రానికి రూ. 27 వస్తే, రాష్ట్రానికి రూ. 28 వస్తోందని, కేంద్రానికి వెళ్లే రూ. 27లో మళ్లీ రాష్ట్రానికి రూ. 12 తిరిగివస్తాయి. ఇది వాస్తవం. వ్యాట్ ఆదాయం వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2 అని అన్నారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీలో చేరుస్తామంటే కేసీఆర్ ఎందుకు వద్దంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశంలోని 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినప్పుడు తెలంగాణ ఎందుకు తగ్గించదని నిలదీశారు. కేంద్రానికి 2.72 లక్షల కోట్ల ఆదాయం వస్తే.. ఇందులో రూ. 2.3 లక్షల కోట్లను రాష్ట్రాలకే ఇస్తోందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications