Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి ఎర్రబెల్లి ఇలాకాలో బండి సంజయ్ సభ; షాపులు మూసివేయిస్తున్న పోలీసులు; బీజేపీ ఫైర్!!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర విస్నూరు గ్రామం నుండి ప్రారంభమైంది. విస్నూరు గ్రామంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించిన బండి సంజయ్ అనంతరం పాదయాత్రగా బయలుదేరారు. అయితే బండి సంజయ్ పాదయాత్ర పాలకుర్తికి చేరుకుని, అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవరుప్పల దాడి ఘటనతో పాలకుర్తి పోలీసులు అలెర్ట్

దేవరుప్పల దాడి ఘటనతో పాలకుర్తి పోలీసులు అలెర్ట్


దేవరుప్పలలో రాళ్ల దాడి ఘటనతో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య హెచ్చరికల పర్వం కొనసాగింది. బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ నేతలపై, మంత్రులపై, పోలీసులపై మండిపడితే, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. ఇక ఇరు పార్టీల మధ్య చోటుచేసుకున్న పొలిటికల్ హీట్ నేపద్యంలో పాలకుర్తిలో జరగనున్న సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పోలీసులు అక్కడ ఉన్న దుకాణం దారులను షాపులు మూసి వేయిస్తున్నారు.

 పాలకుర్తిలో బీజేపీ సభ ...చిరు వ్యాపారుల దుకాణాలను మూసివేయిస్తున్న పోలీసులు

పాలకుర్తిలో బీజేపీ సభ ...చిరు వ్యాపారుల దుకాణాలను మూసివేయిస్తున్న పోలీసులు


రెక్కాడితే కానీ డొక్కాడని చిరు వ్యాపారులను కూడా వదలకుండా పోలీసులు షాపులు బంద్ చేయిస్తున్నారు. టీ కొట్టు, పాన్ షాపు సహా అన్ని దుకాణాలను బలవంతంగా పోలీసులు మూసి వేయిస్తున్న నేపథ్యంలో స్థానికులు పోలీసులను ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దేవరుప్పలలో బిజెపి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగిందని, పాలకుర్తిలోనూ రాళ్ల దాడి జరిగితే దెబ్బలు తగలకుండా ఉండటం కోసం ముందస్తుగా షాపులు మూసి వేయిస్తున్నామని పోలీసులు చెబుతున్నట్లుగా స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు.

టీఆర్ఎస్ ఆదేశాలతోనే పోలీసులు షాపులు మూసివేత... మండిపడ్డ బీజేపీ

టీఆర్ఎస్ ఆదేశాలతోనే పోలీసులు షాపులు మూసివేత... మండిపడ్డ బీజేపీ


టిఆర్ఎస్ పార్టీ ఆదేశాలతోనే పాలకుర్తిలో దగ్గరుండి పోలీసులు షాపులను మూసివేయిస్తున్నారని బీజేపీ నేతలు చెప్తున్నాటు. ఇక పాలకుర్తిలో బండి సంజయ్ నిర్వహించాలనుకుంటున్న సభ వద్ద జన సంచారం లేకుండా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తి లో పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్ పై స్థానిక వ్యాపారులు, స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

    తెలంగాణా అమరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్ *Telangana | Telugu OneIndia
    పాలకుర్తి ఎర్రబెల్లి ఇలాకా .. బీజేపీ సభతో ఉత్కంఠ

    పాలకుర్తి ఎర్రబెల్లి ఇలాకా .. బీజేపీ సభతో ఉత్కంఠ

    టిఆర్ఎస్ తొత్తులుగా పోలీసులు మారారు అంటూ బీజేపీ నేతలు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. పాదయాత్ర పాలకుర్తిలో కొనసాగే నేపథ్యంలో ప్రస్తుత వాతావరణంతో టెన్షన్ చోటుచేసుకుంది. పాలకుర్తి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో మంత్రి ఇలాకాలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా వ్యక్తమవుతోంది. పాలకుర్తిలో బండి సంజయ్ సభను ఫెయిల్ చేయడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఈ తరహా చర్యలకు దిగుతుందని బిజెపి నేతలు భగ్గుమంటున్నారు. మరి పాలకుర్తిలో సభ నేపథ్యంలో ఈ రోజు ఏం జరగబోతుంది అన్నది అటు రాజకీయ వర్గాల్లోనూ, స్థానికులలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+