రైల్వే మంత్రిని కలిసిన బండి సంజయ్: కీలక ప్రాజెక్టుకు ముందడుగు

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ బుధవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్.. అశ్విని వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లారు. కాజిపేట(హసన్‌పర్తి) నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని రైల్వే మంత్రిని కోరారు.

జులై 8న వరంగల్‌లో కాజిపేట వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్‌కు సంబంధించి భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అశ్విని వైష్ణవ్.. బండి సంజయ్‌తో చర్చించారు. కాజిపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.

Bandi Sanjay meets railway minister ashwini vaishnav

ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన అశ్విని వైష్ణవ్.. వెంటనే ప్రాజెక్టు సమగ్ర నివేదికను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్‌కు హామి ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు డీపీఆర్ అందించాలని ఆదేశించారు. కాగా, ఈ సమావేశంలో బండి సంజయ్ తోపాటు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప పాల్గొన్నారు.

ఇది ఇలావుండగా, ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. ఈ పనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీని సంజయ్ పలుమార్లు కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్-వరంగల్(ఎన్‌హెచ్-563 ) జాతీయ రహదారి పనుల విస్తరణకు మోక్షం కలిగింది. ప్రస్తుతం రెండే లేన్లుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ జులై 8న వరంగల్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన చేతులు మీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిత్యం ప్రమాదాలకు కేంద్రంగా మారిన ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడం వల్ల ప్రజల ప్రాణాలకు భద్రత లభించడంతోపాటు గమ్య స్థానాలను వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణ సమయం ఆదా కానుంది. కరీంనగర్-వరంగల్ వరకు మొత్తం 68 కిలోమీటర్ల వరకు 4 లేన్ల విస్తరణ పనులు కొనసాగనున్నాయి. భారతమాల పరియోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 2,146 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+