శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర: ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ల సినిమా అట్టర్ ఫ్లాప్: బండి సంజయ్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందన్న వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వ్యవహారంలో నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి ల పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చిన నేపథ్యంలో బిజెపి టిఆర్ఎస్ నాయకులపై ఎదురు దాడికి దిగింది.

శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర.. మేం వదిలిపెట్టం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని కెసిఆర్ రూపొందించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అంతా ఫెయిల్ అయిందని ఎద్దేవా చేశారు. ఎఫ్ఐఆర్ లో ఎక్కడా బీజేపీ నాయకుల పేర్లు లేకున్నా టిఆర్ఎస్ నేతలు వారి పై ఆరోపణలు చేస్తున్నారని తప్పు పట్టారు. ఈ వ్యవహారాన్ని తాము ఇంతటితో విడిచిపెట్టమని, నిజా నిజాలు నిగ్గు తేల్చే వరకు వదిలి పెట్టమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఇది పీకే, కేసీఆర్ ల కుట్ర
ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలను తాము ఆశ్రయిస్తామని బండి సంజయ్ తేల్చిచెప్పారు. అంతేకాదు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కుట్రకు తెర తీశారు అన్నదానిపై విచారణ జరపాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో కొందరు ఐపీఎస్ లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతుందని పేర్కొన్న బండి సంజయ్, వారు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ మరిన్ని తప్పులు చేస్తున్నారు
అవినీతి ఆరోపణలున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కాపాడబోయి సీఎం కేసీఆర్ మరిన్ని తప్పులు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎవరైతే మంత్రి అక్రమాలపై పూర్తి ఆధారాలతో కోర్టులు, ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారో, తమ హత్యకు కుట్ర జరుగుతుందని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారో వారే హత్యకు కుట్ర చేశారని పోలీసులు వారిపై కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు, హత్యకు కుట్ర జరిగిందని ఢిల్లీ వెళ్లి నిందితులను పట్టుకొచ్చారు అంటూ బండి సంజయ్ విమర్శించారు.

రాష్ట్ర పోలీసులపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్
రాష్ట్ర పోలీసులు తీరుపై ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని. ఇక ఈ విచారణను రాష్ట్ర పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీస సోయి కూడా లేదని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించటం కరెక్ట్ కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజల్లో తిరిగే వాళ్ళం కాబట్టి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఆశ్రయమిస్తామని, భోజనం పెడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications