హైడ్రాతో పాటు కాంగ్రెస్ కు కొరివి పెట్టేవి ఇవే!
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తాజా పరిణామాలు ముంచబోతున్నాయి అంటూ ప్రకటించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ తల గోక్కొంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ పేరుతో మూసీ చుట్టపక్కల ఉన్న పేద హిందువుల ఇండ్లను కూల్చివేసేందుకు కాంగ్రెస్ సిధ్ధమైందన్నారు.
ఒవైసీ ఆక్రమణలను టచ్ చేసే దమ్ముందా?
ఈరోజు హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.పేదల ఇళ్ళను కూల్చే రేవంత్ సర్కార్ కు, హైడ్రాకు మలక్ పేట రేసు కోర్సు నుండి ముసారాంబాగ్ వరకు మూసీ స్థలాలను ఒవైసీ అనుచరులు కబ్జాలు చేసుకున్నారని, వాటిని టచ్ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కి కొరివి పెట్టేవి ఇవే
మూసీ హైడ్రాతో పాటు 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు బిల్లుల అంశాలే కాంగ్రెస్ పార్టీకి కొరివి పెట్టబోతున్నాయని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దమ్ముంటే ఈ మూడు అంశాలపై ఎన్నికల్లోకి పోటీ చేయాలని సవాల్ విసిరారు. హైడ్రా దుశ్చర్యలవల్ల హైదరాబాద్ లోనే కాదు మొత్తం తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉందని, ఆర్దిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు.
మూసీ వెంట ఉన్న ముస్లిం ఇండ్లను కూల్చే దమ్ముందా?
ఏళ్ల తరబడి అన్ని అనుమతులు తీసుకుని, పన్నులు కడుతూ, బ్యాంకు లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే కూల్చి వేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలవల్ల ప్రజలు కారుస్తున్న కన్నీళ్లు మీకు గుర్తుకు రావడం లేదా? అని బండి సంజయ్ నిలదీశారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో దళితులు, హిందువుల ఇళ్మళను కూలుస్తామని బెదిరిస్తున్నారని, మూసీ వెంట ఉన్న ముస్లిం ఇండ్లను కూల్చే దమ్ముందా? అని ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణ పెద్ద బోగస్...
మూసీ సుందరీకరణ పెద్ద బోగస్... గత 30ఏళ్ల నుండి ఈ మాటలు వింటూనే ఉన్నామన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఒకసారి జపాన్ నిధులు తెచ్చారని, ఇంకోసారి జమైకా నిధులు ఖర్చు చేశారని, ఒకాయన ఏకంగా హుస్సేన్ సాగర్ ను కొబ్బరినీళ్లలా మారుస్తానన్నాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.తెచ్చిన నిధులు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి పోతే మూసీ కంపు బారినపడి హైదరాబాద్ ప్రజలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు.
జీతాలకే డబ్బులేదు.. మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్ల అప్పు
జీతాలకే పైసల్లేక అల్లాడుతున్న ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసింది.... అట్లాంటిది మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడ నుండి తెస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేసి జనం నెత్తిన శఠ గోపం పెడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో మరో లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి జనం నడ్డి విరిచేందుకు సిద్ధమైందన్నారు.












Click it and Unblock the Notifications