నదులకు నడకలు నేర్పిన అపర భగీరధుడు కేసీఆర్ ఎక్కడికెళ్ళాడు? బండి సంజయ్ చురకలు!!
తెలంగాణా ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగటంపై బిజెపి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మోటర్లు మునిగిపోయాయి, ఈరోజు ప్రాజెక్టు కుంగి పోయింది అంటూ విమర్శలు గుప్పించిన బండి సంజయ్ ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకుని తిరిగే కేసీఆర్ నుండే ఈ డబ్బులు వసూలు చేయాలంటూ డిమాండ్ చేశారు. తాజా పరిణామంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బట్టబయలు అయిందని పేర్కొన్న బండి సంజయ్ కమిషన్ల కోసం కక్కుర్తి పడి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పరువును కేసీఆర్ సర్కార్ తీస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

నదులకు నడకలు నేర్పిన అపర భగీరధుడు ఇప్పుడు ఎక్కడికి పోయాడని బండి సంజయ్ ప్రశ్నించారు. జరిగిన నష్టానికి కెసిఆర్ బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పై కూడా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్ ది టూత్ పాలిష్ బతకని, కెసిఆర్ ముఖ్యమంత్రి కాకపోతే కేటీఆర్ బిచ్చపు బతుకు బతికేవాడు అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డ కెసిఆర్ ప్రజాధనాన్ని నాశనం చేశారని, కానీ రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు కేటీఆర్ బిల్డప్ ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, అసలు కేటీఆర్ కు ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగి వచ్చాడని బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
అసలు కేటీఆర్ మాట్లాడేది ఒక భాషేనా అంటూ మండిపడిన బండి సంజయ్ కేటీఆర్ లా తాను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని కేటీఆర్ ను టార్గెట్ చేశారు. తండ్రీ కొడుకులు తెలంగాణా రాష్ట్రాన్ని నిలువునా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications