• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ టిల్లు.. సమాధానం చెప్పు? చేనేత జీఎస్టీపై వీడియోతో కేటీఆర్ టార్గెట్‌గా బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆర్ నే అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ విషయంపై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించి మరీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు.

మంత్రి కేటీఆర్ చేనేత జీఎస్టీపై రాసిన లేఖకు బండి సంజయ్ కౌంటర్

మంత్రి కేటీఆర్ చేనేత జీఎస్టీపై రాసిన లేఖకు బండి సంజయ్ కౌంటర్


మునుగోడు ఎన్నికల్లో భాగంగా దీపావళి రోజున బండి సంజయ్ చౌటుప్పల్ లోని చినకొండూరు రోడ్డువద్దనున్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుగోడుసహా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించే ముందు చేనేత పై జిఎస్టి రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ చేనేతపై జీఎస్టీ విధించాలంటూ కేటీఆర్ చేసిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు.

కేటీఆర్ జీఎస్టీ సమావేశంలో మాట్లాడిన వీడియోతో టార్గెట్ చేసిన బండి సంజయ్

కేటీఆర్ జీఎస్టీ సమావేశంలో మాట్లాడిన వీడియోతో టార్గెట్ చేసిన బండి సంజయ్


ఇదిగో వీడియో... ట్విట్టర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతావ్? అంటూ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు. జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నదెవరు? అక్కడఏం చెప్పినవ్.. చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని కేంద్రాన్ని కోరింది నువ్వే కదా అంటూ మండిపడ్డారు. మరి జిఎస్టి సమావేశంలో చేనేత పై జిఎస్టి రద్దు చేయాలని చెప్పకుండా ఏం పీకారంటూ తీవ్ర వ్యాఖ్యలతో నిప్పులు చెరిగారు. చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆ హామీని నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బతుకమ్మ చీరలను వేసే అవకాశం చేనేత కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులుమునుగోడు ప్రజలకు అనేక హామీలిచ్చారు? వాటిలో ఎన్ని నెరవేర్చారు? చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చాలా హామీలను నెరవేర్చనే లేదన్నారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పకుండా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుండటం సిగ్గు చేటని బండి సంజయ్ విమర్శించారు.దొంగ సంతకాలు సృష్టించి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

పొరబాటున కూడా టీఆర్ఎస్ కు ఓటెయ్యకండి

పొరబాటున కూడా టీఆర్ఎస్ కు ఓటెయ్యకండి

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేవలం మునుగోడు ఉపఎన్నికలు మాత్రమే కాదని, తెలంగాణ భవిష్యత్తుకు ముడిపడివున్న ఎన్నికలని బండి సంజయ్ వెల్లడించారు. పొరపాటున టిఆర్ఎస్ పార్టీని ఎన్నికలలో గెలిపిస్తే కెసిఆర్ అహంకారం మరింత తలకెక్కుతుందని బండి సంజయ్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నా, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయినా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, దళిత బందు ఇవ్వకున్నా ప్రజలు ఓట్లు వేశారని, కెసిఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీని మునుగోడులో బండకేసి బాదండి

టీఆర్ఎస్ పార్టీని మునుగోడులో బండకేసి బాదండి

దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో హామీలు నెరవేర్చని టిఆర్ఎస్ పార్టీని అక్కడి ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. మునుగోడు ప్రజలు సైతం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని బండకేసి బాదాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటేయాలని పేర్కొన్న బండి సంజయ్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

English summary
BJP state president Bandi Sanjay reacted to Minister KTR writing a postcard to PM Modi over GST on handloom. With the video of KTR's speech, it was stated that it was KTR asked the Center to impose 5 percent GST on handlooms..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X