వారిని వదిలేదు లేదు..బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్..!!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలోని రాజకీయ నాయకులకు హెచ్చరిక చేసారు. ఈ మేరకు బండి సంజయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యం పేరుతో ప్రసంగాలు చేస్తూ.. మావోయిస్టుల సాయుధ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తున్న వారు వెంటనే తమ సంబంధాలు తెంచుకోవాలని.. లేనిపక్షంలో వారి బండారం బయటపడడం ఖాయమన్నారు. మావోయిస్టుల వైపు నిలబడితే క్షమించేది లేదని సంజయ్ తేల్చి చెప్పారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ ఖాతా వేదికగా సంచలన పోస్టు చేసారు. ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సహా పలువురు మావోయిస్టులు లొంగి పోయారు. కాగా, మల్లోజుల మావోయిస్టులతో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. మావోయిస్టు గెరిల్లాలు, కొందరు తెలంగాణ రాజకీయ నేతల మధ్య కుమ్మక్కైనట్లుగా మల్లోజుల చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ 'ఎక్స్' వేదికగా పోస్ట్ పెట్టడం సంచలనంగా మారుతోంది.

బండి సంజయ్ తన పోస్టింగ్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్ట్ నెట్‌వర్క్ వద్దే ఆగవని.. అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడే వ్యవస్థ మొత్తం వెలికి తీసి కఠినంగా అణచివేస్తాయన్నారు. ఎవరైనా సరే.. ఎంత పెద్దవారైనప్పటికీ.. దేశ భద్రత విషయంలో మావోయిస్టుల వైపు నిలబడితే క్షమించేది లేదన్నారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులతో సంబంధాలున్న నేతలు ఎవరూ? అనే చర్చ సాగుతుంది.












Click it and Unblock the Notifications