పోసాని కృష్ణమురళి ఒక ద్రోహి... ఆయన చావు భయంకరంగా ఉంటుంది.. బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు
సినీ నటుడు,రచయిత పోసాని కృష్ణమురళిపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ తీవ్ర విమర్శలు చేశారు.నిర్మాతగా కంటే పవన్ కల్యాణ్ వీరాభిమానిగా పాపులర్ అయిన గణేశ్... ఇటీవల పవన్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. పోసాని కృష్ణమురళి ఎవరు అధికారంలో ఉంటే వారి వెనక తిరిగే వ్యక్తి అని విమర్శించారు.ఆయన ఓ ఎక్స్‌పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ వంటి వాడని ఎద్దేవా చేశారు. పోసాని కృష్ణమురళి ఒక ద్రోహి అని... ఆయన చావు భయంకరంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం(సెప్టెంబర్ 1) ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పోసాని భార్య నాకు తల్లి లాంటిది : బండ్ల గణేశ్
పోసాని కృష్ణ మురళి ప్రవర్తనను చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటోందన్నారు. పోసాని భార్య తనకు తల్లి లాంటిదని... ఆయనను భరిస్తున్న ఆమెకు పాదాభివందనం చేస్తానని పేర్కొన్నారు.పోసాని గురించి మాట్లాడితే తన స్థాయి తానే తగ్గించుకున్న వాడినవుతానని అన్నారు.పవన్ కల్యాణ్‌ను ఎన్నయినా తిట్టండి కానీ ఆయన తల్లి అంజనాదేవి, ఇతర ఆడవాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.పవన్ కల్యాణ్ తల్లి కారణంగా ఇవాళ ప్రత్యక్షంగా,పరోక్షంగా ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని పేర్కొన్నారు.

మంచు విష్ణు వ్యాఖ్యలు బాధించాయి : బండ్ల గణేశ్
మా ఎన్నికల్లో ఇద్దరు గొప్ప వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో నిలబడి ఇచ్చిన హామిలను నేరవేర్చలేకపోతే తప్పు చేసినవాడిని అవుతానని... అందుకే ఎన్నికల బరి నుంచి పెద్దల సలహాతో తప్పుకోవాల్సి వచ్చిందన్నారు.'మా' ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ఇచ్చిన హామిలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో తాను ప్రకాష్ రాజ్ గారికే ఓటు వేస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగానే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన మీద కోపం ఉంటే.. తనను ఇబ్బంది పెట్టండి... అంతేగానీ వేరే హీరోలను ఇబ్బంది పెట్టవద్దని పవన్ కళ్యాణ్ కోరారని గుర్తుచేశారు. ఆయన ఇండస్ట్రీ మనిషే కాదని మంచు విష్ణు అనడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఇండస్ట్రీ వైపు ఉన్నారా లేక పవన్ కల్యాణ్ వైపు ఉన్నారా అని మంచు విష్ణు మాట్లాడటం బాధ కలిగించిందన్నారు. పవన్ కల్యాణ్ అంటే ఇండస్ట్రీ మొత్తానికి రథ సారథి లాంటివాడని అన్నారు. సాధారణ నటుడిగా పరిచయమైన పవన్... స్టార్‌గా ఎదిగి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారని అన్నారు. ఎంతోమందిని చిత్రపరిశ్రమకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ఏ హీరోకి సమస్య ఉన్నా ఆయన స్పందిస్తారని అన్నారు.'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలవగానే.. ఆయన్ను ఒప్పించి 100 మంది పేద కళాకారులకు ఇళ్లు అందించే కార్యక్రమం చేపడతానని అన్నారు.
Recommended Video

పవన్‌పై పోసాని సంచలన ఆరోపణలు
ఇటీవల రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆన్‌లైన్ టికెటింగ్‌పై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ విరుచుకుపడటం... ఆయనకు కౌంటర్‌గా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిందే. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ హీరోయిన్ పూనమ్ కౌర్‌ను మోసం చేశాడని ఆరోపించారు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. ఆమెకు కడుపు చేసి అబార్షన్ చేయించాడని... పవన్ చేసిన మోసానికి ఆమె పిచ్చిదానిలా మారిపోయిందని అన్నారు.ఆడవాళ్ల పట్ల పవన్ కల్యాణ్‌కు నిజంగా గౌరవం ఉంటే ఆమెకు న్యాయం చేయాలన్నారు. పవన్ ఫ్యాన్స్ తన భార్యను,కుటుంబ సభ్యులను బూతులు తిడుతున్నారని ఆరోపిస్తూ... తాను కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.పవన్ కటుంబ సభ్యులపై కూడా నోరు జారారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బండ్ల గణేశ్ పోసానికి కౌంటర్ ఇచ్చారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications