టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తో బంజారా జేఏసీ నేతల భేటీ.!తమ న్యాయపోరాటానికి మద్దత్తివ్వాలని విజ్ఞప్తి.!
హైదరాబాద్ : బంజారా జేఏసీ నిర్వహించనున్న జాతీయ స్థాయి ఉద్యమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలతో సహా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో బంజారా జేఏసీ నాయకులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

టీఆర్ఎస్ నేత వినోద్ ను కలిసిన బంజారా జేఏసీ నేతలు.. మద్దత్తు ఇవ్వాలని విజ్ఞప్తి
జాతీయ స్థాయిలో నిర్వహించనున్న తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బంజారా జేఏసీ నాయకులు వినోద్ కుమార్ ను కోరారు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన బంజారా జేఏసీ నాయకులు శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమై ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.

న్యాయ పరంగా ఉన్న బంజారా జేఏసీ డిమాండ్లు.. సంఘీభావం ప్రకటించిని బోయినపల్లి వీనోద్
త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బంజారా జేఏసీ నాయకులతో కలిసి హైదరాబాద్ లో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బంజారా జేఏసీ నాయకులు వినోద్ కుమార్ కు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తమ కుల దైవం అయిన కింగ్ శుర్ వీర్ లఖిషా బంజారా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, అందుకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి ముందుకు సాగేందుకు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని బంజారా జేఏసీ నాయకులు వినోద్ కుమార్ ను కోరారు.

వెనుకబడుతున్న బంజారా జాతి.. డిమాండ్ల సాధనకోసమే పోరాటమన్న జేఏసీ నేతలు
దీంతో పాటు జాతీయ స్థాయిలో బంజారా కులస్థులకు రిజర్వేషన్ విధానం ఒకేవిధంగా ఉండేలా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా వారు వినోద్ కుమార్ ను కోరారు. న్యాయ పరంగా ఉన్న బంజారా జేఏసీ డిమాండ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బంజారా జేఏసీ నాయకుల డిమాండ్లను సీఎం కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

కేసీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్తా.. హామీ ఇచ్చిన వినోద్
వినోద్ కుమార్ తో సమావేశమైన బంజారా జేఏసీ నాయకులలో కన్నీరాం రాథోడ్ ( కర్నాటక ), గుర్మీత్ రాథోడ్ ( తమిళనాడు ), రమేష్ రాథోడ్ ( ఆంధ్రప్రదేశ్ ), సింపల్ రాథోడ్ ( మహారాష్ట్ర ) రామారావు మహారాజ్ భాటేగావలర్ ( మహారాష్ట్ర ), పవార్ రమేష్ ( గోవా ), అంబు రాథోడ్ ( తెలంగాణా ), ఎల్. రూప్ సింగ్ ( తెలంగాణా ), తదితరులు ఉన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications