హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కాదు, సీజనల్ వ్యాధులతో జాగ్రత్త: పానీపూరి లాంటి బయటి తిండ్లు వద్దంటూ డీహెచ్ శ్రీనివాస్ కీలక సూచనలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని.. అయితే, ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్. వర్షాలు కురుస్తున్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. వ్యక్తిగత, పరిసరా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సీజనల్ వ్యాధులతో జాగ్రత్తంటూ డీహెచ్

సీజనల్ వ్యాధులతో జాగ్రత్తంటూ డీహెచ్

రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు డీహెచ్ శ్రీనివాస్. ఈ సీజన్లో పాము కాటుకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో సీజనల్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

తెలంగాణలో గెండ్యూతోపాటు ప్రబలుతున్న మలేరియా, టైఫాయిడ్

తెలంగాణలో గెండ్యూతోపాటు ప్రబలుతున్న మలేరియా, టైఫాయిడ్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ డెంగీ వ్యాపిస్తోందని తెలిపారు. 2019 తర్వాత మళ్లీ ఏ ఏడాదే డెంగీ కేసులు భారీగా పెరిగాయని వివరించారు. మలేరియా నిర్యూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని డీహెచ్ వెల్లడించారు. సీజనల్ వ్యాదుల కట్టడికి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక సూచనలు చేశారని శ్రీనివాస్ చెప్పారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నీళ్ల వీరేచనాలు కలుగుతాయని, ఇప్పటి వరకు 6వేల కేసులు నమోదైనట్లు తెలిపారు. మరోవైపు, తెలంగాణలో టైఫాయిడ్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని
చెప్పారు.

సీజనల్ దరిచేరకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సీజనల్ దరిచేరకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ క్రమంలో వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని వివరించారు.

వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
ఇంట్లో, పరిసరాల్లో ఉన్న డ్రమ్ముల్లో, ఇతర పాత్రల్లో నీరు ఎప్పటికప్పుడు తొలగించాలి.
ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం చేపట్టి.. ఇంట్లో నిలువ ఉన్న నీటిని పారబోయాలి.
వేడివేడి ఆహారం, గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి.
మల,మూత్ర విసర్జన తర్వాత చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి
పానీపూరిలాంటి రోడ్ల పక్కన చిరుతిండ్లు తినకూడదు.
గర్భిణీలు డ్యూడేట్ కంటే వారం ముందే ఆస్పత్రిలో చేరాలి.
బాలింతలు, చంటిపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలి.
మాస్కు తప్పని సరిగా ధరించాలి.

కొత్త వేరియంట్ వస్తే తప్ప.. కరోనాకు ఎండ్ పడినట్లేనంటూ డీహెచ్

కొత్త వేరియంట్ వస్తే తప్ప.. కరోనాకు ఎండ్ పడినట్లేనంటూ డీహెచ్

వ్యాధులు సోకితే.. సొంత మాత్రలు వాడకుండా వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్ సూచించారు. క్లోరిన్‌ మాత్రలను వైద్యశాలల్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు డీహెచ్. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని సర్కార్ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. గత ఆరు వారాలుగా కరోనా కేసుల సంఖ్య పెరిగిందని డీహెచ్ వెల్లడించారు.కరోనా‌కు సంబంధించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. కరోనా ఎండ్‌ దశకు చేరుకుందని, కొత్త వేరియంట్ వస్తే తప్ప కేసులు పెరిగే అవకాశం లేదన్నారు. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలతో కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారిపోయిందని అన్నారు. కరోనా వైరస్ లక్షణాలుంటే కేవలం ఐదు రోజులే క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అనవసరంగా కరోనా ట్రాకింగ్, ట్రేసింగ్ వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నట్లు శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదన్నారు.

English summary
Be careful with seasonal diseases: Telangana DH Srinivas on rainy season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X