వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విఎన్ఆర్ కాలేజ్, బియాస్ నది ట్రాజెడీ: వడ్డీ సహా రూ.20లక్షల పరిహారం ఇవ్వాలని హైకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిమ్లా/హైదరాబాద్: 2014 ఏడాదిలో హైదరాబాద్ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు శనివారం నాడు తీర్పు చెప్పింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహార ఇవ్వాలని ఆదేశించింది.

ఈ ఘటనలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని హైకోర్టు మండిపడింది. బాధితుల కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ఈ పరిహారంలో 60 శాతాన్ని బియాస్ నది ఆనకట్ట బోర్డు చెల్లించాలని ఆదేశించింది.

Beas tragedy: High Court orders Rs 20 lakh for kin of victims

30 శాతాన్ని కళాశాల యాజమాన్యం, మిగిలిన పది శాతాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పరిహారంపై 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.

2014 జూన్ 8న హైదరాబాదులోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు. నాడు మృతి చెందిన వారిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు.

English summary
The Himachal Pradesh High Court has ordered an ex-gratia compensation of 20 lakh rupees each to the families of 24 students of Hyderabad based College who were washed away in Beas River.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X