బ్యూటీషీయన్ జ్యోతి డెత్: సందీప్‌తో 3 ఏళ్ళుగా లవ్, అక్కడ గాయమెలా, ప్రియుడెక్కడ?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:బ్యూటీషీయన్ జ్యోతి అనుమానాస్పద మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బ్యూటీషీయన్ జ్యోతి, సందీప్‌ మధ్య ప్రేమ వ్యవహరం మూడేళ్ళుగా కొనసాగుతోందని పోలీసులు గుర్తించారు. సందీప్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మైలారం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం నాడు ఉదయం జ్యోతి అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. అయితే ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె మృతి చెందింది. జ్యోతి మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమ వ్యవహరమే కారణమా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. జ్యోతి మరణంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 జ్యోతి మరణానికి కారణమేమిటి

జ్యోతి మరణానికి కారణమేమిటి

బ్యూటీషీయన్ జ్యోతి మరణానికి కారణాలేమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. లింగంపల్లిలో బ్యూటీషీయన్‌గా పనిచేసే జ్యోతి మైలారం రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదస్థితిలో మరణించడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ అనే వ్యక్తితో జ్యోతికి లవ్ ఎఫైర్ ఉందని పోలీసులు గుర్తించారు.అయితే సందీప్ ఆచూకీ కన్పించడం లేదు. అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.మూడేళ్ళుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని పోలీసులు చెబుతున్నారు.

 సందీప్ ఎక్కడ

సందీప్ ఎక్కడ

జ్యోతి చనిపోయిన ప్రాంతానికి ఆదివారం రాత్రి పూట సందీప్ వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సందీప్ సెల్‌ఫొన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ విషయాన్ని పోలీసులు చెబుతున్నారు. అయితే జ్యోతి చనిపోయిన తర్వాత సందీప్ ఆచూకీ లేకుండా పోయింది. సందీప్ ఫోన్ కూడ స్విచ్చాఫ్ అయింది. దీంతో పోలీసులు సందీప్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 జ్యోతి మృతికి కారణమిదే

జ్యోతి మృతికి కారణమిదే

బ్యూటీషీయన్ జ్యోతి మృతికి తలకు గాయం కావడం వల్లే మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. వికారాబాద్ ఆసుపత్రిలో జ్యోతి మృతదేహనికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో తలకు గాయం వల్లే ఆమె చనిపోయిందని తేలింది. అయితే ఈ గాయం ఎలా అయిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

జ్యోతి మృతి ఎలా జరిగింది

జ్యోతి మృతి ఎలా జరిగింది

బ్యూటీషీయన్ జ్యోతి మృతి విషయమై పోలీసులు కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రమాదవశాత్తు రైలు నుండి జ్యోతి కిందపడిందా, లేక ఎవరైనా కిందకు తోసేశారా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి సోదరి మాత్రం సందీప్‌పై అనుమానాలను వ్యక్తం చేస్తుంది. ఈ విషయమై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 21-year-old beautician Jyothi suspicious death on Monday in Vikarabad district. Government Railway Police said that she boarded a passenger train from Hyderabad to reach her home after her work.police investing this case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X