బీర్ల ధరలు పెంపు - కొత్త రేటు ఇలా..!!

మద్యం ప్రియలకు షాక్ ఇచ్చే నిర్ణయం. తెలంగాణలో బీర్ల ధరలు పెంపుకు రంగం సిద్దం అవుతోంది. తాజాగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ మద్యం ఆదాయం భారీగా వస్తుందనే అంచనాలను ప్రతిపాదించింది. దీంతో మద్యం ధరలు పెరగటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, ప్రస్తుతం బీర్ల ధరలను దాదాపు ప్రస్తుం ఉన్న ధరల కంటే 10-12 శాతం మేర పెంచే అవకాశం ఉందని అదికార వర్గాల సమాచారం.

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రూ 68 కోట్ల మేర బీరు ఉత్పత్తి అవుతుందని అంచనా. రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇందు కోసం 12 బీర్ల కేసుకు ప్రస్తుతం టీఎస్బీసీఎల్ రూ 289 చెల్లిస్తోంది. పన్నులు అన్నీ కలిపి రూ 1400 చొప్పున రిటైల్ వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి మద్యం వినియోగదారులకు కేసు బీరు రూ 1800 కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ధరలు పెరగనున్నాయి.

Beers Rates likely to hike in Telangana up to12 percent on selected brands

దీంతో ఒక్కో బీరు కోసం వినియోదారుడు సగటున రూ 150 చెల్లించాల్సి వస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఉత్పత్తి కంపెనీలతో ధరల సవరణ పైన నిర్ణయం తీసుకుంటారు. చివరగా 2022 మే లో 6 శాతం చొప్పున రెండు సార్లు బీర్ల ధరలు పెరిగాయి. నిర్వహణ ఖర్చులు పెరగటంతో మరోసారి ధరలు పెంచాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే, కంపెనీలు ప్రతిపాదించిన స్థాయిలో ధరలు పెంచితే వినియోగదారు ల పైన భారీగా భారం పడుతుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..10 -12 శాతం వరకు ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. పెరిగన ధరల పైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తే సెప్టెంబర్ 1న నుంచి అమల్లోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+