Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

maruthi rao suicide: మానసిక ఒత్తిడా..? సోదరుడి వేధింపులా...? ఆత్మహత్యకు కారణమేంటీ..?

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటీ..? కూతురు చేత ఛీత్కరానికి గురవడమా..? లేదంటే కేసులా వేధింపులా..? ఇటీవల మారుతీరావు షెడ్డులో లభించిన మృతదేహాం ఎవరిదీ..? ఆ హత్యతో మారుతీరావుకు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు సగటు వ్యక్తి మెదడును తొలచివేస్తోంది. వీటితోపాటు ఆస్తికి సంబంధించిన లావాదేవీల్లో కూడా గొడవలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంతకీ మారుతీరావు ఆత్మహత్యకు కారణమెంటీ..?

Recommended Video

    Amrutha Pranay Father | వేధింపులా..? మానసిక ఒత్తిడా..? పశ్చాత్తాపమా? ఆత్మహత్యకు కారణమేంటీ..?
    ఒక్కరే కూతురు..

    ఒక్కరే కూతురు..

    నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు మధ్యతరగతి కుటుంబం. కానీ రియల్ ఎస్టేట్ ద్వారా కోట్లు సంపాదించారు. మారుతీరావుకు ఒక్కరే కూతురు అమృత.. కానీ ఆమె ప్రణయ్‌ను ప్రేమించింది. వారి ప్రేమను అంగీకరించకపోవడంతో.. ఇంట్లో నుంచి బయటకి వెళ్లి పెళ్లి చేసుకుంది. దీంతో రగిలిపోయిన మారుతీరావు రెండేళ్ల కిందట కిరాయి రౌడీలతో హత్య చేయించాడు. ఇక అప్పటినుంచి మారుతీరావు పతనం ప్రారంభమైంది. ప్రణయ్ హత్యతోపాటు ఇతర కేసులు కూడా మారుతీరావును వెంబడిస్తున్నాయి. ఇటీవలే షెడ్డులో మరో డెడ్ బాడీ దొరికింది. దీంతోపాటు చాలా కేసులు మారుతీరావు మెడకు చుట్టుకున్నాయి. కేసులతో ఉక్కిరి బిక్కిరయ్యారని వాదన ఉన్న.. పోలీసుల వేధింపుల వల్లేనని కుటుంబసభ్యులు చెప్తున్నారు.

    సోదరుడి వేధింపులు...

    సోదరుడి వేధింపులు...

    మరోవైపు మారుతీరావు సోదరుడి నుంచి కూడా వేధింపులు వస్తున్నాయి. మారుతీరావుకు ఒక్కరే సంతానం.. తన భర్తను హత్య చేయించడంతో తండ్రి మీద అమృత పీకలమీద కోపంతో ఉన్నారు. దీంతో తన కుమారులపై ఆస్తి రాయాలని సోదరుడు అడుగుతున్నాడు. ఆస్తి ఎవరి పేరు మీద రాస్తారని.. కుమారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీనిపై సోదరుడికి ఏం చెప్పాలో తెలియని మారుతీరావు.. మిర్యాలగూడకు వెళ్లడం లేదు. పని ఉంటే తప్ప అక్కడికి వెళ్లడం లేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మిర్యాలగూడకు వెళితే సోదరుడి కుమారుల మీద ఆస్తి రాయాల్సి వస్తుందని అనుకొని ఉంటాడు. అందుకే సిటీలోనే మారుతీరావు గడుపుతున్నారు.

    ప్రణయ్ హత్య

    ప్రణయ్ హత్య

    గర్భవతి అయిన అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తోన్న సమయంలో దాడి చేశారు. ప్రణయ్‌ను దారుణంగా హత్య చేశారు. ప్రణయ్ దాడి కేసులో తన తండ్రి మారుతీరావుపై అమృత అనుమానం వ్యక్తం చేశారు. హత్య, పీడీ యాక్ట్ కేసు పెట్టడంతో.. మారుతీరావు జైలుకెళ్లాడు. ఆరునెలల కింద జైలు నుంచి బయటకువచ్చాడు. అప్పటినుంచి కూతురుతో సంప్రదింపులు జరిపాడు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం అమృత పేరున రాస్తానని మధ్యవర్తులతో రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. కానీ అందుకు అమృత అంగీకరించకపోవడంతో.. ఆత్మహత్య శరణ్యం అనుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+