రేవంత్ తగ్గడం వెనుక కారణాలు అనేకం: నష్టం జరిగాక ఆలస్యంగా, ఇలా షాక్, వీటికి సమాధానమేది?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆసక్తికర ప్రకటన చేశారు. తనపై మీడియాలో అవాస్తవ ప్రచారం జరుగుతోందని కొట్టిపారేశారు.

చదవండి: అంతా తూచ్, అబద్దం, మా నేతలను అంటారా: హఠాత్తుగా రేవంత్ యూటర్న్, ఎందుకు!?

తద్వారా తాను పార్టీ మారటం లేదని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు, తమ పార్టీ నేతలపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: రమణకు చంద్రబాబు ఫోన్, రేవంత్ రెడ్డి గురించి ఆరా, తలసాని ఇంట్లో కేటీఆర్‌ను కలవడంపై

రేవంత్ ముందు ఆ రెండు? ఎన్టీఆర్ భవన్ లో నేడే తేలనుందా ? | Oneindia Telugu

తన వ్యాఖ్యల ద్వారా టిడిపి అధిష్టానానికి పార్టీ మారటం లేదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. కానీ ఆయన మాటలను టి-టిడిపి నేతలు నమ్మలేదు. ఆయన మాటల్లో స్పష్టత లేదని చెబుతున్నారు.

చదవండి: అంతా వృథా: బిజెపిని దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి నిర్ణయం, వణుకు, టిడిపి క్లోజ్!

అనుమానాలకు తెరలేపి, ఆలస్యంగా ముగింపు పలికారా

అనుమానాలకు తెరలేపి, ఆలస్యంగా ముగింపు పలికారా

కాంగ్రెస్ పార్టీలో చేరికకు రేవంత్ రెడ్డియే అనుమానాలకు తెరలేపారు. ఆ తర్వాత ఆయనే ఆలస్యంగా ముగింపు పలికే ప్రయత్నం చేశారని అంటున్నారు. రాహుల్ గాంధీని కలవడం, కాంగ్రెస్‌లో చేరికపై తర్వాత తేలుతుందనే ధోరణిలో మాట్లాడటం, టి-టిడిపి భేటీలో మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలు నిలదీస్తే ఘాటుగా సమాధానాలు చెప్పడం, వీటన్నింటికి తోడు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఇన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా పెదవి విప్పకపోవడం గమనార్హం.

జరగాల్సిన నష్టం జరిగిపోయింది

జరగాల్సిన నష్టం జరిగిపోయింది

ఇప్పుడు రేవంత్ ఆలస్యంగా స్పందించినా జరగాల్సిన నష్టం ఆయనకు వ్యక్తిగతంగా జరిగిందంటున్నారు. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్‌లోనే ఇన్నాళ్లు ఆయనను చూసి టిడిపిలో కొనసాగిన నేతలు ఇప్పుడు తెరాసలో చేరారు. ఇప్పుడు ఆయన టిడిపిలో ఉంటున్నానని చెప్పినంత మాత్రాన వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. పైగా ఇన్నాళ్లు ఆయన పెదవి విప్పలేదు. దీంతో జరగాల్సిన నష్టం జరిగింది.

స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా అనుమానాలే

స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా అనుమానాలే

ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ అందులో స్పష్టత కనిపించడం లేని తెలంగాణ టిడిపి నేతలు అంటున్నారు. చంద్రబాబు వచ్చాక అన్ని విషయాలను ఆయనకు చెబుతానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతోను అనుమానం కలుగుతోంది.

రేవంత్ రెడ్డి తగ్గడం వెనుక ఎన్నో కారణాలు

రేవంత్ రెడ్డి తగ్గడం వెనుక ఎన్నో కారణాలు

ఇక, రేవంత్ రెడ్డి టిడిపిలోనే ఉంటానని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఓ విధంగా యూటర్న్. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికపై రేవంత్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకోవడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు రంగంలోకి దిగారు?

చంద్రబాబు రంగంలోకి దిగారు?

ఆదివారం మధ్యాహ్నం టిటిడిపి నేతలు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి అంశంపై చర్చించారు. ఆ సమయంలో టిటిడిపి అధ్యక్షులు రమణ మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు ఫోన్ చేశారని, తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారని చెప్పారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి రేవంత్ రెడ్డికి నచ్చప్పారా అనే చర్చ సాగుతోంది. లోకేష్ కూడా చర్చించి ఉంటారని అంటున్నారు.

కాంగ్రెస్ నుంచి రాని హామీ, ఇది ప్రధాన కారణం

కాంగ్రెస్ నుంచి రాని హామీ, ఇది ప్రధాన కారణం

రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు తన డిమాండ్ల మేరకు హామీ రాకపోవడమే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార బాధ్యతలు, తనతో వచ్చే నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డిమాండ్లు ముందుంచారు. ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ రాలేదని తెలుస్తోంది. రేవంత్ తాజా ప్రకటన వెనుక ఇదే ప్రదాన కారణమని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికతో నష్టం జరుగుతోందని తెలిసే

కాంగ్రెస్ పార్టీలో చేరికతో నష్టం జరుగుతోందని తెలిసే

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉత్సాహం కనిపించిందంటున్నారు. కానీ స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్‌లోనే ఆయన వర్గం నేతలు తెరాసలో చేరారు. అంటే దీని వల్ల తనకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని తెలిసిందని, అలాగే తన వెంట టిడిపి కేడర్ కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిసి వెనక్కి తగ్గారని అంటున్నారు.

ఏపీ టిడిపి నేతలపై విమర్శలకు సమాధానం ఏది

ఏపీ టిడిపి నేతలపై విమర్శలకు సమాధానం ఏది

ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వాటికి సమాధానం ఏమిటని నిలదీస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు దీనిపై స్పందించారు. రేవంత్ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు, రేవంత్ వ్యవహారంపై టిడిపి నేతల్లో వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. రేవంత్‌కు షోకాజ్ ఇవ్వాలని మోత్కుపల్లి చెప్పగా, ఆయన వివరణ ఇచ్చారని అవసరం లేదని మరికొందరు చెప్పారు. అయిత షోకాజ్ ఇస్తేనే కేడర్‌లోకి సానుకూల సంకేతాలు వెళ్తాయని మోత్కుపల్లి చెప్పారు.

రేవంత్ ఏ రంగు మారిస్తే మాకేంటి?

రేవంత్ ఏ రంగు మారిస్తే మాకేంటి?

రేవంత్ రెడ్డి ఏ రంగు మారిస్తే మాకు ఏమిటని తెరాస ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆయనను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన గురించి తాము అసలు ఆలోచించడం లేదన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugu Desam working president Revanth Reddy takes U turn on party change. He said that he will not join any party.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి