అంతా తూచ్, అబద్దం, మా నేతలను అంటారా: హఠాత్తుగా రేవంత్ యూటర్న్, ఎందుకు!?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఊహించని షాకిచ్చారు. హఠాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు!

చదవండి: అంతొద్దు!: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నో, మోత్కుపల్లి గుట్టు విప్పేనా?

తాను పార్టీ మారుతున్నానంటూ ఇన్నాళ్లూ వచ్చిన వార్తలను ఓ విధంగా కొట్టి పారేశారు. అంతేకాదు, టిడిపి నేతలపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తద్వారా తాను టిడిపిలోనే ఉంటానని చెప్పకనే చెప్పారు. పొత్తులపై అధినేత చంద్రబాబు చూసుకుంటారని, ఎన్నికలకు ముందు ఉంటుందన్నారు.

చదవండి: అంతా వృథా: బిజెపిని దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి నిర్ణయం, వణుకు, టిడిపి క్లోజ్!

మీడియాలో వస్తున్నది అంతా అబద్దం

మీడియాలో వస్తున్నది అంతా అబద్దం

మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల కోసం పోరాడి తాను గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పారు. తమ పార్టీ నేతలపై అవాస్తవాలు ప్రసారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అయోమయానికి గురి చేస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలపై దృష్టి

అయోమయానికి గురి చేస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలపై దృష్టి

తమ పార్టీ నాయకులపై వస్తున్న వార్తలు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 26న టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్ల వెల్లడించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామన్నారు.

ఏ పార్టీలో చేరడం లేదు

ఏ పార్టీలో చేరడం లేదు

తాను ఏ పార్టీలో చేరడం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలతో కార్యకర్తలు ఎలాంటి తొందరపాడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.

చంద్రబాబుకు అన్నీ చెప్తా

చంద్రబాబుకు అన్నీ చెప్తా

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ప్రస్తుత పరిణామాలను ఆయనకు వివరిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. పార్టీని వీడటం లేదని, వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తెరాస ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశంలో కూడా ఇదే విషయమై రేవంత్‌ను పార్టీ నేతలు నిలదీశారు. రాహుల్ గాంధీని ఏ హోదాలో కలిశారని మోత్కుపల్లి నిలదీశారు. కానీ హఠాత్తుగా రేవంత్ యూ టర్న్ తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు

రేవంత్ రెడ్డి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు

రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే చర్చ ప్రధానంగా కాంగ్రెస్, టిడిపిలో సాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugu Desam working president Revanth Reddy takes U turn on party change. He said that he will not join any party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి