భానుడి భగభగ: భద్రాచలంలో రికార్డ్ ఉష్ణోగ్రత
తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం కావడం గమనార్హం.
భద్రాచలం: తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం కావడం గమనార్హం.
యానంబైలు గ్రామంలో 44.1 డిగ్రీలు ఉంది. ఈ రెండూ భద్రాద్రి కొత్తగూడెంలోనివే. దీంతో పాటు వైరాలో 44, మహబూబ్ నగర్ 42.6, ఖమ్మంలో 42.2, అదిలాబాదులో 41.3, హైదరాబాదులో 40 డిగ్రీలు నమోదయింది.

ఈ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణ స్థాయి కంటే రెండు లేదా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.












Click it and Unblock the Notifications