భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తడిబట్టలతో ప్రమాణాల రభస.. బీజేపీ పసుపునీళ్ళ శుద్ధి

హన్మకొండలో కుడా భూముల వేలం పాట చిలికి చిలికి గాలివానగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టు గత వారం రోజులుగా కొనసాగుతుంది. తాజాగా ఈ పంచాయతీ తడి బట్టల ప్రమాణాలతో భద్రకాళీ మాత సన్నిధానానికి చేరి ఉద్రిక్తతలకు కారణమైంది. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని ఏషియన్ మాల్ వెనుక ఉన్న రెండు ఎకరాల భూముల ప్లాట్లను 21వ తేదీన కుడా వేలం వేసింది.

కుడా భూముల వేలంతో అవినీతి ఆరోపణలు

ఈ బహిరంగ వేలంలో ఒక్కో గజం 75 వేల రూపాయల నుంచి 96 వేల రూపాయల మధ్య పలికింది. అయితే ఈ వేలం పాటలో అవినీతి జరిగిందని మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆరోపించారు. అక్కడ గజం లక్షల 50 వేల రూపాయలు పలుకుతుందని, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిసి అవినీతికి పాల్పడ్డారని కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపణలు చేశారు.

అవినీతిపై తడిబట్టలతో ప్రమాణాల సవాల్

ఇక ఈ అంశం పైన వారం రోజుల నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.కుడా భూముల వేలంలో అవినీతి జరిగిందని తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తానని, అవినీతి చేయకపోతే కాంగ్రెస్ నాయకులు తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు మర్రి యాదవ రెడ్డి.

bhadrakali temple political tension political drama at Sri Bhadrakali Temple as Congress BRS bjp

భద్రకాళి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్

చెప్పినట్టుగానే నిన్న ఉదయం మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో భద్రకాళి ఆలయానికి వచ్చి అక్కడే స్నానం చేసి తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆలయం వద్ద రాజకీయాలు చేయడం మంచిది కాదని నచ్చచెప్పి వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన మాట వినకపోవడంతో మర్రి యాదవ రెడ్డిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

తడిబట్టలతో భద్రకాళి గుడి వద్ద కాంగ్రెస్ నాయకుల రాజకీయం

బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ వాహనాలను అడ్డుకోగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక నిన్న మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు కూడా భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆలయం వద్ద స్నానం చేసి తడి బట్టలతో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా పనిచేస్తున్న తమపై అనుచిత వ్యాఖ్యలు సరి కాదన్నారు.

ఆలయ శుద్ధికి రంగంలోకి బీజేపీ

మర్రి యాదవ్ రెడ్డి చేసిన సవాళ్లను స్వీకరించి తను ఆలయం వద్దకు వచ్చానని, కబ్జాలు, అవినీతి చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎందుకు ఆలయం వద్దకు రాలేదంటూ ప్రశ్నించారు. భద్రకాళి ఆలయం సాక్షిగా ఈ రెండు పార్టీలు చేసిన హంగామాని చూసి ఆలయాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అపవిత్రం చేశారని, నేడు బిజెపి నేతలు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు.

చదువుల తల్లికి లక్ష్మీ కళ.. 49రోజుల్లో కోటి దాటిన హుండీ ఆదాయం!
చదువుల తల్లికి లక్ష్మీ కళ.. 49రోజుల్లో కోటి దాటిన హుండీ ఆదాయం!

బీజేపీ నాయకుల అరెస్ట్ లతో ఉద్రిక్తత

పసుపు నీళ్లతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. వీరిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+