Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

140 కి.మీ. వేగంతో కారు నడిపిన భరత్, అవుటర్ పై ప్రమాదాలకు కారణలివే!

టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు నటుడు భరత్ రాజు మరణానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. భరత్ నడిపిన కారు ప్రమాదానికి గురైన సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తోందని అధికారులు.

హైదరాబాద్: టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు నటుడు భరత్ రాజు మరణానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. భరత్ నడిపిన కారు ప్రమాదానికి గురైన సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తోందని అధికారులు గుర్తించారు.

శంషాబాద్ నోవాటెల్ నుండి నుండి గచ్చిభౌలికి తిరిగివస్తోండగా శనివారం రాత్రి పదిగంటల సమయంలో భరత్ రాజు కారుకు ప్రమాదానికి గురైంది.అయితే ఈ సమయంలో కారు వేగం 140 కిలోమీటర్ల వేగాన్ని స్పీడో మీటర్ సూచిస్తోంది.

అతివేగం కారణంగానే భరత్ రాజు మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రోడు పక్కనే లారీని నిలిపి ఉంచాడు డ్రైవర్ . అయితే నిబంధనలకు విరుద్దంగా లారీని రోడ్డు పక్కన నిలిపి ఉంచడంతో చివరినిమిషంలో భరత్ ఈ లారీని గుర్తించాడు.

నిలిపి ఉన్న లారీని ఢీకొట్టడంతో భరత్ ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భరత్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

140 కి.మీ స్పీడ్ తో భరత్ కారు

140 కి.మీ స్పీడ్ తో భరత్ కారు

అవుటర్ రింగ్ రోడ్డుపై భరత్ అతివేగంతో నడిపాడు. రాత్రి పూట ఇంటికి వెళ్ళే సమయంలో ఆయన నడిపిన వాహనం 140 కిలోమీటర్ల వేగంతో నడిపాడని స్పీడో మీటర్ సూచిస్తోంది. రోడ్డుపైన లారీని చివరి నిమిషంలో గుర్తించిన భరత్ రాజు తన వాహనాన్ని నిలిపివేసేందుకు చర్యలను తీసుకొన్నాడు.అయితే వాహనం కంట్రోల్ కాలేదు. దీంతో రోడ్డుపై టైర్ మరకలు కన్పిస్తున్నాయి. కానీ, కారు మాత్రం కంట్రోల్ కాలేదు. లారీని కారును ఢీకొట్టడంతో భరత్ ఎడమకాలు, కుడి చెయ్యి విరిగిపోయింది. తలకు బలమైన గాయాలు తగిలాయి.

అవుటర్ పై పదిచోట్ల ప్రమాదాలు

అవుటర్ పై పదిచోట్ల ప్రమాదాలు

అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రధానంగా పదిచోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొంటున్నట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు.అయితే ఈ ప్రదేశాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తీసుకొంటున్న చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి.అయితే ఎందుకు ఈ ప్రాంతాల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయమై అధికారులు శాస్త్రీయంగా విశ్లేషణ చేసి, ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ రకమైన ప్రమాదాలు చోటుచేసుకోనే అవకాశాలు లేకపోలేదు.

అవుటర్ పై ప్రయాణించే వాహనాల వేగంపై స్పష్టత ఇవ్వాలి

అవుటర్ పై ప్రయాణించే వాహనాల వేగంపై స్పష్టత ఇవ్వాలి

8 లైన్ల రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పై తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు అతి వేగం కారణంగా చోటుచేసుకొంటున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.అంతేకాదు ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన డ్రైవర్లకు అవగాహన లేకపోవడం కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఏ రోడ్డు మార్గంలో ఎంత వేగంతో ప్రయాణం చేయాలనే విషయమై డ్రైవర్లకు అవగాహాన కల్పించాల్సి ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహన డ్రైవర్లకు ఈ విషయమై స్పష్టంగా తెలిసేలా చర్యలు తీసుకోవాలి. 1, 2 లైన్ల రోడ్డులో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. 3, 4 రోడ్ల లైన్ లో గంటలకు 80 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణం చేయాలి.అయితే పొరపాటున ఒక లైన్ నుండి మరో లైన్ కు వాహనం మళ్ళించడం ద్వారా కూడ ప్రధానంగా ప్రమాదాలకు కారణంగా మారుతోంది.

అర్ధరాత్రి పూటే ఎక్కువ ప్రమాదాలు

అర్ధరాత్రి పూటే ఎక్కువ ప్రమాదాలు

అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము లోపుగానే ఎక్కువగా అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. అయితే ఈ సమయంలో అవుటర్ పై పోలీసుల నిఘా ఎక్కువగా లేని కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. గతంలో ఈ రోడ్డుపై సైబరాబాద్ పోలీసుల పర్యవేక్షణ ఉండేది.అయితే ప్రస్తుతం ఈ రోడ్డును సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోకి వచ్చింది.అయితే ఎక్కువ పోలీస్ సిబ్బందితో రోడ్డుపై పెట్రోలింగ్ చేసే అవకాశం దక్కింది.అయితే ఈ విషయమై రెండు కమిషనరేట్లకు చెందిన అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

కఠిన చర్యలు తీసుకొంటేనే ప్రమాదాల తగ్గుదల

కఠిన చర్యలు తీసుకొంటేనే ప్రమాదాల తగ్గుదల

అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను నివారించాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ రోడ్డుపైన ఉన్న టోల్ ప్లాజా సమీపంలో కాని, ఇతర ప్రాంతాల్లో కూడ పోలీసులు చెకింగ్ ను ఏర్పాటుచేస్తే ప్రమాదాలను తగ్గించే అవకాశం లేకపోలేదు. రాత్రిపూట కూడ మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా లేదా అనే విషయాలను తనిఖీ చేయాలి. మరోవైపు సర్వీస్ రోడ్లపై కాకుండా అవుటర్ రింగ్ రోడ్డుపైనే వాహనాన్ని నిలిపి ఉంచితే వాహన యజమానును కఠినంగా శిక్షించాలి.గతంలో ఇదే రోడ్డు పై జరిగిన ప్రమాదాల్లో నటుడు కోట శ్రీనివాసరావు కొడుకు, ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ కొడుకు, తాజాగా నటుడు భరత్ రాజు మరణించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+