అనుమానాస్పద స్థితిలో భీమ్ సింగ్ అనే వ్యక్తి మృతి, పోలీసులపై దాడికి యత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మంగళహట్ పోలిస్ స్టేషన్ పరిధిలో భీమ్ సింగ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకే ఆయన మరణించాడని మృతుడి బంధువులు ఆరోపించారు.అయితే పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన చేశారు. మృతుడి బంధువులు మంగళ్ హట్ పోలిసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు..

హైద్రాబాద్ పాతబస్తీలోని మంగళ్ హాట్ పోలీసి స్టేషన్ పరిధిలోని రహీంపురాకు చెందిన భీమ్ సింగ్ బేగంబజార్ కు చెందిన దిలీప్ బారతి లు స్నేహితులు. శుక్రవారం రాత్రి రహీంపురా వద్ద కలుసుకొన్నారు.

bheem singh died in police custody at manghalhat police station

కొద్దిరోజుల క్రితం దిలీప్ భారతి కుమార్తై వివాహం జరిగింది. ఈ వివాహం సందర్భంగా తనకు విందు ఇవ్వలేదని భీమ్ సింగ్ అనడంతో ఇద్దరి మద్య వాగ్వావాదం జరిగింది. భీమ్ సింగ్ ఆవేశంతో దిలీప్ పై దాడి చేశాడు.

దీంతో దిలీప్ మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.దిలీప్ ను కొట్టానని భీమ్ సింగ్ పోలీసుల ముందే అంగీరించాడు. అయితే ఈ విషయమై కేసు నమోదు చేశారు పోలీసులు.

శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎస్ ఐ శివ ఆధార్ కార్డును తెప్పించాలని భీమ్ సింగ్ ను కోరారు.ఎస్ ఐ సెల్ ఫోన్ నుండే ఇంటికి పోన్ చేసి ఆధార్ కార్డును పంపాలని భీమ్ సింగ్ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.

వెంటనే ఆయన బాత్ రూమ్ కు వెళ్ళాడు. బాత్ రూమ్ కు వెళ్ళిన భీమ్ సింగ్ ఎంతకు బయటకు రాలేదు.ఈ లోపుగా పెద్ద శబ్దం వచ్చింది. గది తలుపులు తెరిచి చూసేసరికి భీమ్ సింగ్ పడిపోయి ఉన్నాడని , ఉస్మానియా ఆసుపత్రికి తరలించేసరికి ఆయన మరణించాడని వైద్యులు చెప్పారని పోలీసులు చెబుతున్నారు.

ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్దే పోలీసులపై భీమ్ సింగ్ కుటుంబసభ్యులు, బంధువులు దాడికి ప్రయత్నించారు.పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లే ఆయన చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.భీమ్ సింగ్ మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు..

భీమ్ సింగ్ మృతికి పోలీసులే కారణమంటూ లోథ్ సమాజ్ యువకులు, భీమ్ సింగ్ కుటుంబసభ్యులు మంగళహట్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. పోలీసుల వాహనానికి నిప్పు పెట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
bheem singh died in police custody at manghalhat police station on saturday. bheem singh family members tried to attack on police.
Please Wait while comments are loading...