హైటెక్ కాపీయింగ్, బుక్కైన విద్యార్థి: రేప్ కేసులో టిడిపి నేత ఫ్రెండ్ అరెస్ట్
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ చేయబోయిన విద్యార్థికి చుక్కెదురైంది. బ్లూటూత్ ద్వారా కాపీకి ప్రయత్నించిన విద్యార్థిని ఇన్విజిలేటర్ కనిపెట్టాడు. ఆ విద్యార్థి పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది.
ప్రత్యేక పరికరంపై సెల్ ఫోన్ విడిభాగాలన్నీ అమర్చి చొక్కా లోపల బనియన్‌కు తగిలించుకున్నా ఆ విద్యార్థి, దానికి మైక్రో సిమ్ అమర్చాడు. బ్లూటూత్‍లోని చిన్న భాగాన్ని ఎవరికీ కనిపించకుండా చెవిలోపల పెట్టుకున్నాడు. బయట నుంచి ఓ స్నేహితుడు సమాధానాలు చెప్పేందుకు సిద్ధమయ్యాడు.
అయితే, ఇన్విజిలేటర్ గుర్తించారు. దాంతో ఆ విద్యార్థి బండారం బయటపడింది. అజీజ్ అనే విద్యార్థి ఎస్సార్ నగర్లోని రాయల్ జూనియర్ కాలేజీలో చదివాడు. మొదటి సంవత్సరం ఎకనామిక్స్ పేపర్ తప్పడంతో సప్లిమెంటరీ రాసేందుకు శనివారం పరీక్ష కేంద్రానికి వచ్చాడు.

అజీజ్ పరీక్ష హాల్లోకి వచ్చే సమయంలోనే ఇన్విజిలేటర్‌కు అతనిపై అనుమానంవచ్చింది. అజీజ్‌ను, అతనికి సహకరించిన షేక్ జావెద్‌ను పోలీసులు ్దుపులోకి తీసుకున్నారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అత్యాచారం కేసులో తెలంగాణ టిడిపి నేత స్నేహితుడి అరెస్ట్
ఓ యువతిని రేప్ చేసిన కేసులో తెలంగాణ టిడిపి నాయకుడు అమరం వినోద్ స్నేహితుడు రమేష్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి సీఐ మంత్రి సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపూర్‌కు చెందిన అజయ్ కుమార్ వర్మ భార్య తన భర్త వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో పంచాయితీ పెద్ద మనిషిగా వ్యవహరించిన తెలంగాణ టిడిపి నాయకుడు అమరం వినోద్... అజయ్ కుమార్ వర్మ నుంచి సెటిల్‌మెంట్ చేస్తానని చెప్పి 2013లో నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్న విషయం అజయ్ భార్యకు తెలియడంతో ఆమె 2014లో వినోద్‌ను అడిగేందుకు గాంధీనగర్‌లో ఉన్న ఆయన కార్యాలయానికి వచ్చింది.
వినోద్ వెంట ఉన్న రమేష్, సురేష్ తనను బెదిరించడంతో పాటు ముగ్గురు కలిసి రేప్ చేశారని అప్పట్లో సిసిఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు మహిళ పేర్కొంది. పరిశీలించిన సిసిఎస్ ఉన్నతాధికారి స్వాతీ లక్రా చిక్కడపల్లి పోలీసులకు 2016లో కేసును అప్పగించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు జనవరి 7న వినోద్‌తో పాటు ఆయన స్నేహితులు రమేష్, సురేష్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న ముగ్గురు నిందితుల్లో ఒకడైన రమేష్‌ను పోలీసులు నగర శివారులో అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు. ప్రధాన నిందితుడు అమరం వినోద్ కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసు నుంచి అతనిని తప్పించేందుకు కొందరు రాజకీయ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం త్వరలోనే వినోద్‌ను అరెస్ట్ చేస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications