తెల్చేశారు, పట్టరాని ఆనందం: యాపిల్ సిఈవో టిమ్ కుక్‌తో కెటిఆర్ సెల్ఫీ
హైదరాబాద్ : తెలంగాణా ఐటీ శాఖామంత్రి కెటి రామారావు చివరికి అతి పెద్ద వార్తను వెల్లడించారు. గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అంటూ ఊరించిన మంత్రి హైదారబాదులో యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం కావడమే బిగ్ న్యూస్ అని తేల్చేశారు. హైదరాబాద్ లో యాపిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం కావడం పట్ల ఆయన అనందానికి హద్దులు లేకుండా పోయాయి.
భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ గురువారం హైదరాబాద్ లోని వేవ్ రాక్ భవనంలో టెక్ సెంటర్ ను ప్రారంభించగా, మంత్రి కేటీర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత కేటీఆర్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.
Photos: హైదరాబాద్‌లో టిమ్ కుక్

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తండ్రి కె చంద్రశేఖర రావుతో పాటు టిమ్ కుక్ తో తీసుకున్న అరుదైన సెల్ఫీని కెటిఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫ్రెంజీ ఔట్ సైడ్ వేవ్ రాక్ అంటూ మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతోపాటు యాపిల్ సంస్థ ఎంబ్లమ్ 'యాపిల్' ను తమ పార్టీ గులాబీ రంగుతో పూర్తిగా నింపేశారు.
అమెరికా తరువాత అతి పెద్ద డెపలప్ మెట్ సెంటర్ కు హైదరాబాద్ వేదిక అయిందని ట్విట్ చేశారు. నిరుడు మేనెలలో గూగుల్ వస్తే, ఇపుడు యాపిల్ హైదరాబాద్ కు తరలి వచ్చిందని కమెంట్ చేశారు. ప్రపంచంలో అతి విలువైన దిగ్గజ టెక్ కంపెనీలు అయిందింటిలో యాపిల్ తో కలిపి నాలుగు కంపెనీలు( గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్) కార్యాలయాలను స్థాపించడం విశేషమని, ఇది హైదరాబాద్ కు గర్వకారణమని కేటీర్ అన్నారు.












Click it and Unblock the Notifications