కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం
తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ కేసీఆర్ తో తలపడిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటమి పాలయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికి రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకుంది. ఇక తాజాగా రేవంత్ రెడ్డి విజయంతో కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కాంగ్రెస్ .

ప్రతిపక్ష పార్టీల అవసరం గుర్తించిన తెలంగాణా ప్రజలు .. రేవంత్ రెడ్డి కి ఎంపీగా అవకాశం
ఆరు నెలలు. కేవలం ఆరు నెలలు. తెలంగాణ ఓటరు మనసు ఊహించని విధంగా మారిపోయింది. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గతం కంటే ఎక్కువగా మెజార్టీ కట్టబెట్టిన తెలంగాణ ఓటర్లు... ఆరు నెలలు తిరిగేసరికి కేసీఆర్‌కు షాక్ ఇచ్చేలా తీర్పు ఇవ్వాలని డిసైడయ్యారు. రేవంత్ రెడ్డిని ఓడించి టీఆర్ ఎస్ కు పట్టం కట్టిన ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం వుందని గుర్తించారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం పనులు చెయ్యడాని ఆలస్యంగా అర్ధం చేసుకున్న ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, బీజేపీ కి అవకాశం ఇచ్చారు.

మల్కాజ్ గిరి నుండి రేవంత్ రెడ్డి విజయం .. కేసీఆర్ కు బిగ్ షాక్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ , టీఆర్ఎస్‌ను విమర్శించడంలో అందరికంటే ముందుండే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో విజయం సాధించారు. అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. మొదట నుండీ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకున్న గులాబీ బాస్ కేసీఆర్ రేవంత్ ఓటమి కోసం విఫల యత్నం చేశారు .అయినప్పటికీ రేవంత్ దీటుగా పోరాటం చేశారు.

మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం .. మూడు చోట్ల బీజేపీ విజయం
రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మధ్య చివరి రౌండ్ వరకు గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. అయితే చివరి రౌండ్ వరకు స్వల్ప అత్యధికను ప్రదర్శిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డినిఆ ఖరి రౌండ్‌లో విజయం వరించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నల్గొండ, భువనగిరిలో విజయ బావుటా ఎగురవేసింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను ఎవరూ ఊహించని విధంగా బీజేపీ సొంతం చేసుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్‌కు, గులాబీ బాస్ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి విజయం మాత్రం దిమ్మతిరిగే షాక్ అని చెప్పక తప్పదు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications