వేణుస్వామికి హైకోర్టు బిగ్ షాక్-చైతూ-శోభిత విడాకుల జోస్యంపై...!

టాలీవుడ్ నటీనటులు నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ తర్వాత వీరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వేణు స్వామి అలియాస్ వేణు పరాంకుశానికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై గతంలో ఇదే వ్యవహారంలో తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. వీటిని హైకోర్టులో సవాల్ చేసిన వేణుస్వామికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గతంలో నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో వేణు స్వామి వీరిద్దరి జ్యోతిష్యం చెప్పారు. శుభమా అంటూ ఎంగేజ్మెంట్ జరుగుతుండగా వీరిద్దరూ భవిష్యత్తులో విడాకులు తీసుకుంటారంటూ వేణు స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ తమ ముందు హాజరు కావాలని వేణు స్వామిని ఆదేశించింది.

big shock to venu swamy in hc allow women commission actino in naga Chaitanya-sobhita issue

అయితే మహిళా కమిషన్ కు ఆ అధికారం లేదంటూ హైకోర్టుకు వెళ్లి వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. దీనిపై తదుపరి విచారణ నిర్వహించిన హైకోర్టు.. ఆ స్టే ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు వేణుస్వామిపై చర్యలు తీసుకునేందుకు
కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని తీర్పు ఇచ్చింది. అలాగే వారం రోజుల్లోనే వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు స్పష్టం చేసింది. దీంతో మహిళా కమిషన్ ఏం చేయబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+