అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్-కేసు వెనక్కి తీసుకోనున్న మృతురాలి భర్త ?
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు, ఆయన అరెస్టు, రిమాండ్ వ్యవహారాలు ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణమైన హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ ఇవాళ యూటర్న్ తీసుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. అల్లు అర్జున్ పై ఫిర్యాదు వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
అవసరమైతే తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానని ఈ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ ఇవాళ హైదరాబాద్ లో వెల్లడించారు. వాస్తవానికి హీరో అల్లు అర్జున్ కు ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పారు.బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్ తో పాటు ఆ రోజు చాలా మంది థియేటర్‌కు వచ్చారని భాస్కర్ తెలిపారు. దీంతో భాస్కర్ తదుపరి అడుగులు, దీనిపై పోలీసులు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

వాస్తవానికి సంధ్య థియేటర్ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్ చనిపోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. ఆమె కుటుంబానికి 25 లక్షలు పరిహారం కూడా ప్రకటించారు. అంతే కాదు చనిపోయిన రేవతి కుమారుడిని గాంధీ హాస్పిటల్ కు వెళ్ళి పరామర్శించారు కూడా. ఇప్పుడు మృతురాలి భర్త భాస్కర్ తాను ఫిర్యాదు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించి ఈ మొత్తం వ్యవహారానికి ట్విస్ట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications