• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Anchor Ravi: ఏ ఒక్కరినీ వదిలి పెట్ట: ఎంత దూరమైనా వెళ్తా: ట్రోలర్స్‌పై ఫైర్..కంప్లైంట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా సాగుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 వివాదాలను కొని తెచ్చుకుంటోంది. బిగ్‌బాస్ హౌస్ లోపల సిరి హన్మంతు-షణ్ముఖ్ జశ్వంత్‌ ట్రాక్‌పై ఇప్పటికే వివాదాలు చెలరేగుతున్నాయి. నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేస్తోన్నారు వారిద్దరి మీద. మాజీ కంటెస్టెంట్ జెస్సీ అలియాస్ జశ్వంత్ పడాల సైతం ఆ ఇద్దరి వైఖరిని తప్పు పట్టాడు. తమ రిలేషన్‌షిప్ మీద షణ్ముఖ్ జశ్వంత్ క్లారిటీ ఇచ్చినా ఈ వివాదం సద్దమణగట్లేదు. తమ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని అతను స్పష్టం చేశాడు.

 సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

తాజాగా మరో వివాదం తలెత్తింది. ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల దాకా వెళ్లింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మాజీ కంటెస్టెంట్, టాప్ యాంకర్ రవి.. దీనికి కారణం అయ్యారు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్న సమయంలో- సోషల్ మీడియా వేదికగా వచ్చిన నెగెటివ్ కామెంట్స్, హేట్ ట్రోలింగ్స్‌పై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తనను, తన కుటుంబాన్ని కించపరిచిన నెటిజన్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 భార్య, కుమార్తెపైనా..

భార్య, కుమార్తెపైనా..


రవి భార్య నిత్య, కుమార్తె వియాపైనా ట్రోల్స్ చేయడాన్ని యాంకర్ రవి తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమపై చేసిన ట్రోలింగ్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను సైతం తీసి పెట్టుకున్నాడు. వాటన్నింటినీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సైబర్ క్రైమ్ పోలీసులతో తాను చేసిన చాటింగ్‌ను కూడా యాంకర్ రవి బయట పెట్టారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వాటిని పోస్ట్ చేశారు. ఒక కుటుంబం, అందులో ఉన్న మహిళలు, చిన్నపిల్లలపై ఇలా ఎలా ట్రోల్స్ చేయగలుతారంటూ యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేశారు.

టఫ్ కాంపిటిటర్‌గా..

టఫ్ కాంపిటిటర్‌గా..


నిజానికి- యాంకర్ రవిని టఫ్ కాంపిటిటర్‌గా భావించారు. టాప్-5లో ఉండొచ్చనే అంచనాలూ మొదట్లో వెలువడ్డాయి. హౌస్ నుంచి వెళ్లిపోయిన తోటి కంటెస్టెంట్లు కూడా ఇదే విషయాన్ని వెలిబుచ్చారు. వారి అంచనాలన్నీ తప్పాయి. తలకిందులు అయ్యాయి. 12వ వారంలో అతను బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఇందులో రాజకీయం జరిగిందంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు టీ రాజాసింగ్ సైతం కొన్ని అనుమానాలను లేవనెత్తిన విషయం తెలిసిందే.

బ్యాడ్ కామెంట్స్..

బ్యాడ్ కామెంట్స్..


యాంకర్ రవికి బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్నో నిక్ నేమ్స్ వచ్చాయి. వాటి మీద జోక్స్ పడ్డాయి. సోషల్ మీడియాల మెమెస్ సైతం క్రియేట్ అయ్యాయి. సీజన్ మొదట్లోనే అతనికి గుంటనక్క అనే ముద్ర పడింది. అందులో నుంచి బయటపడలేకపోయాడు యాంకర్ రవి. నటరాజ్ మాస్టర్ ఏ ముహూర్తంలో గుంటనక్క అనే పేరు పెట్టాడో గానీ.. అది అతన్ని 12వ వారం వరకూ వెంటాడుతూనే వచ్చింది. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా రవిని గుంటనక్కగా సంబోధించిన ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి.

ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్‌గా..

ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్‌గా..

ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్‌గా కూడా పిలిపించుకుంటుంటాడు యాంకర్ రవి. తోటి వారిని తన మాటల మాయాజాలంలో పడేసి, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటాడనే పేరును తెచ్చుకున్నాడు. వారిని అలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, తాను మాత్రం తన గేమ్‌ను సేఫ్‌గా ఆడుతుంటాడని తోటి కంటెస్టెంట్లు బాహటంగానే చాలాసార్లు ప్రస్తావించారు. అక్కినేని నాగార్జున కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్.. మరి ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌కు గురయ్యాడో గానీ.. ఆ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు చెబుతున్నారు.

English summary
Bigg Boss 5 Telugu Contestant Anchor Ravi Files Compliant In Cyber Crime About Trolling His Family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X