సిరితో షన్ను క్లోజ్‌నెస్: దీప్తి ఫ్యాన్స్ ఫైర్: టైటిల్‌పై ఎఫెక్ట్ పడుతుందా?

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుదశకు వచ్చేసింది. ఇంకో వారమే మిగిలి ఉన్నాయి. అటు బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ వారం మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే 13 మంది ఎలిమినేట్ అయ్యారు. 14వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది.

సరయు నుంచి..

సరయు నుంచి..

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత యానీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు.

ఎవరూ ఊహించని విధంగా టఫ్ కాంపిటీటర్‌గా భావించిన యాంకర్ రవి సైతం హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత- ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ.. ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌ను వీడారు. 19 మందితో మొదలైన ఈ రియాలిటీ షోలో ఇప్పుడు మిగిలింది ఆరు మందే. వారిలోనూ ఆదివారం రాత్రి మరొకరు ఎలిమినేట్ కానున్నారు.

కాజల్‌కు నో ఛాన్స్..

కాజల్‌కు నో ఛాన్స్..

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆర్జే కాజల్ అని తెలుస్తోంది. ఈ దఫా ఆమె పెర్‌ఫార్మెన్స్ ఏ మాత్రం ఆకట్టుకోని విధంగా సాగిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతోన్నాయి. టాస్కుల్లో ఆమె తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయారని అంటున్నారు. ఇన్నిరోజులు కొనసాగడమే గొప్ప అనే నెటిజన్లు, వీక్షకులు కూడా లేకపోలేదు. పూర్ పెర్‌ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ రేస్ నుంచి కాజల్ తప్పుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారనే అంచనాలు ఉన్నాయి.

టాప్ 5లో సన్నీ ఎంట్రీ..

టైటిల్ రేసులో నిలిచే తొలి అయిదుమంది ఎవరనే విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ రాత్రి నాటి ఎపిసోడ్‌తో అది అధికారికంగా తేలిపోతుంది. శ్రీరామచంద్ర ఇదివరకే ఫైనలిస్ట్ అయ్యాడు.. ఫైనల్ లిస్ట్‌లోకి వచ్చేశాడు. రెండో ఫైనలిస్ట్‌గా వీజే సన్నీ నామినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో రెండో ఫైనలిస్ట్ అతనే. మిగిలిన ముగ్గురు ఎవరు.. వారి నంబర్సే ఏమిటనేది ఈ రాత్రి నాటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. కాజల్ ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయమైందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- మానస్ నాగులపల్లి, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్ టాప్-5లో ఎంట్రీ కావచ్చు.

సిరి-షన్ను క్లోజ్‌నెస్‌పై..

బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని వారాలుగా షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంతు చాలా క్లోజ్‌గా ఉంటోన్నారనేది బహిరంగ రహస్యం. చాలా ఎపిసోడ్స్‌లో ఇది స్పష్టమైంది కూడా. షన్ను వెంటే సిరి అన్నట్టుగా కనిపించారు వారిద్దరు. చాలా టాస్క్‌లల్లో వారిద్దరూ ఒకరినొకరు సపోర్టు చేసుకున్నారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లోనూ ఇదే కనిపించింది. ఉన్న ఆరు మందిలో ఎవరు.. ఏ స్థానంలో ఉండాలనే విషయంపై నిర్వహించిన హోస్ట్ అక్కినేని నాగార్జున నిర్వహించిన గేమ్‌లో సిరి హన్మంతు.. షణ్ముఖ్ జశ్వంత్‌ను సపోర్ట్ చేశారు. నా సపోర్ట్ ఎప్పుడూ వాడికే అంటూ షన్నును ఉద్దేశించి చెప్పారు.

క్లోజ్‌నెస్ దెబ్బ కొడుతుందా?

క్లోజ్‌నెస్ దెబ్బ కొడుతుందా?

బిగ్‌బాస్ హౌస్‌కు రాకముందు వారిద్దరి మధ్య ఎలాంటి పరిచయాలు ఉండేవో.. అసలు ఉన్నాయో లేదో తెలియట్లేదు గానీ.. ఈ ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చిన తరువాత క్లోజ్ అయ్యారు. హౌస్ నుంచి జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ అనారోగ్య కారణాలతో బయటికి వెళ్లిన తరువాత సిరి-షన్ను మిగిలారు. తామిద్దరం స్నేహితులం అని చెప్పుకొంటూనే దానికి మించి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటూ నెటిజన్ల నుంచి కామెంట్స్ సైతం వ్యక్తం అయ్యాయి. నటి మాధవీలత వారిద్దరిపై ఫైర్ అయింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో వీళ్లిద్దరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీప్తి సునయన ఫ్యాన్స్‌లో అసంతృప్తి..

ఈ వ్యవహారం అటు దీప్తి సునయన అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్లలోనూ కొంత అసహనానికి, అసంతృప్తికి దారి తీసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీప్తి సునయన-షణ్ముఖ్ జశ్వంత్ లవర్స్ అనే విషయం తెలిసిందే. షన్నును సపోర్ట్ చేయాలంటూ ఆమె ఇదివరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తన అభిమానులు, ఫాలోవర్స్‌కు రిక్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని చెబుతున్నారు నెటిజన్లు.

దీప్తి మౌనంగా ఉన్నారా?

దీప్తి మౌనంగా ఉన్నారా?

టాప్-5లోకి రావడం ఖాయమైనప్పటికీ- టైటిల్ కోసం షన్నుకు ఓట్లు వేయాలంటూ ఆమె రిక్వెస్ట్ చేయట్లేదని అంటున్నారు. దీనికి కారణం.. సిరి-షన్ను మధ్య ఉన్న క్లోజ్‌నెస్ అని అంచనా వేస్తోన్నారు. అదే నిజమైతే- షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓట్లు పడతాయా? లేదా? అనేది ఉత్కంఠతగా మారింది. టైటిల్ విన్నింగ్ రేస్‌లో తోటి కంటెస్టెంట్లకు గట్టిపోటీ ఇస్తోన్న షన్ను.. దీప్తి సునయన అభిమానులు, ఫాలోవర్లలో అసంతృప్తి నెలకొనడానికి కారణం అయ్యాడని చెబుతున్నారు. ఇది ఓటింగ్ మీద ప్రభావం చూపొచ్చని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+