• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Big Boss Telugu 5: కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...ఫుల్ లిస్ట్ ఇదే!

|

హైదరాబాద్: టెలివిజన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. ఊహించినట్టే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టీవీ వీక్షకులను ఉర్రూతలూగించింది. తొలి ఎపిసోడ్‌లోనే ఆసక్తిని కలిగించింది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లు, టీవీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలెబ్రిటీలు బిగ్‌బాస్ టైటిల్ కోసం తమ వేట మొదలు పెట్టారు. ఒక టైటిల్ కోసం 19 మంది కంటెస్టెంట్లు ఈ సారి పోటీ పడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లల్లో తమ సత్తాను నిరూపించుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు.

  Bigg Boss Telugu 5 కు నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా ? || Oneindia Telugu

  రేపు మహబూబ్‌నగర్‌కు వైఎస్ షర్మిల: ఆ యూనివర్శిటీ వద్ద దీక్ష..రేపు మహబూబ్‌నగర్‌కు వైఎస్ షర్మిల: ఆ యూనివర్శిటీ వద్ద దీక్ష..

   కోవిడ్ ప్రొటోకాల్స్..

  కోవిడ్ ప్రొటోకాల్స్..

  ఇదివరకట్లాగే- కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఈ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మొదలైంది. రియాలిటీ షో ప్రారంభానికి ముందే హౌస్‌మేట్స్ అందరూ క్వారంటైన్‌కు వెళ్లొచ్చారు. క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేసుకున్న తరువాతే వారందరూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సంవత్సరం అంటే బిగ్‌బాస్ సీజన్ 4ను కూడా కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్యే నిర్వహించిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్లకు ఎలాంటి ఆపద రాకుండా నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.

   కలర్‌ఫుల్‌గా హౌస్..

  కలర్‌ఫుల్‌గా హౌస్..

  ఎప్పట్లాగే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో గ్లామర్ డోస్ అధికంగా కనిపించింది. లహరి షారీ, సిరి హన్మంత్, ప్రియాంక అలియాస్ తేజ, హమీదా, సీనియర్ నటులు ప్రియ, ఉమాదేవి, అనీ మాస్టర్‌లతో పాటు యాంకర్ రవి, మానస్ నాగులపల్లి, విశ్వ, నటరాజ్‌, షణ్ముఖ జశ్వంత్‌, శ్రీరామచంద్ర, లోబోతో హౌస్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. సందడిగా మారింది. వారిలో ఎవరు విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలంటే మూడు నెలలకు పైగా వేచి చూడాల్సి ఉంటుంది.

   రెమ్యునరేషన్ ఎంత..

  రెమ్యునరేషన్ ఎంత..

  బిగ్‌బాస్ సీజన్ ఎప్పుడు ప్రారంభమైనా.. మొట్టమొదటగా డిబేట్ మొదలయ్యేది వారికి చెల్లించే రెమ్యునరేషన్‌పైనే. హోస్ట్ అక్కినేని నాగార్జునకు నిర్వాహకులు ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు? కంటెస్టెంట్లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే డిబేట్స్, డిస్కషన్స్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై జోరుగా సాగుతుంటాయి. ఈ సారి కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో రెమ్యునరేషన్ డిబేట్స్ పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతున్నాయి.

  నాగ్‌కు రూ.12 కోట్లు..

  నాగ్‌కు రూ.12 కోట్లు..

  కొన్ని అంచనాల ప్రకారం.. హోస్ట్‌ చేస్తోన్నందుకు అక్కినేని నాగార్జున 12 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఆయన ఎనిమిది కోట్ల రూపాయలను తీసుకోగా.. ఈ మొత్తాన్ని భారీగా పెంచినట్లు చెబుతున్నారు. కంటెస్టెంట్లలో అత్యధిక పారితోషికాన్ని యాంకర్ రవికి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ప్రతీవారం రెండు లక్షల రూపాయల చొప్పున చెల్లించేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని సమాచారం. వారి సంపాదనకు అనుగుణంగా ప్రతివారం చెల్లించే రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్వాహకులు నిర్ధారించినట్లు చెబుతున్నారు.

   యాంకర్ రవికి అత్యధిక పారితోషికం..

  యాంకర్ రవికి అత్యధిక పారితోషికం..

  బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. పూర్తి జాబితా ప్రకారం.. యాంకర్ రవి- రూ.2 లక్షలు, షణ్ముఖ్ జశ్వంత్-రూ.లక్షా 80 వేలు, అనీ మాస్టర్-రూ.లక్షా 80 వేలు, శ్రీరామచంద్ర-లక్షా 60 వేలు, వీజే సన్నీ-లక్షా 20 వేలు, నటరాజ్ మాస్టర్-రూ. లక్ష, లహరి షారీ-రూ. లక్ష, సీనియర్ నటి ప్రియ-రూ. లక్ష, సిరి హన్మంత్-రూ.లక్ష, విశ్వ-రూ.90 వేలు, హమీదా-రూ.80 వేలు, శ్వేత వర్మ-రూ.80 వేలు, లోబో-రూ.80 వేలు, నటి ఉమాదేవి-రూ.80 వేలు, సరయు-80 వేలు, మానస్ నాగులపల్లి-రూ.70 వేలు, జెస్సీ-50 వేలు, రేడియో జాకీ కాజల్-50 వేలు, ప్రియాంక అలియాస్ తేజ-50 వేల రూపాయలను చెల్లిస్తున్నట్లు సమాచారం.

  English summary
  Bigg Boss Telugu 5 season are going to charge a whopping amount this time. Highest remuneration paid to the anchor Ravi as Rs 2 lakhs per week, reports said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X