ములుగులో బిల్ట్ కంపెనీ రీ-ఓపెన్: సిద్దిపేటలో కోకా-కోలా గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్, భారీగా పెట్టుబడులు

హైదరాబాద్: ములుగు జిల్లా కమలాపురంలో "బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్" (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014 లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు.

నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినంలో ఉన్నాయి. ఆ కంపెని ఎండీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు.

BILT and Coca-Cola representatives meets telangana CM Revanth Reddy

మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సీఎంతో పాటు మంత్రులు అనసూయ, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సిద్దిపేటలో కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు

పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ చీఫ్ హిమాన్షు ప్రియదర్శి నేతృత్వంలోని హిందుస్థాన్ కోకా-కోలా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో కొనసాగుతున్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌తో సహా రాష్ట్రంలో తమ కంపెనీ రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం గురించి సందర్శించిన బృందం సిఎంకు తెలియజేసింది.

ఇతర విషయాలతోపాటు, రాష్ట్రంలో కమ్యూనిటీ అభివృద్ధికి నిరంతరం సహకరించేందుకు తమ నిబద్ధతపై హెచ్‌సిసిబి ప్రతినిధి బృందం సిఎంకు హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వ హెచ్‌సిసిబి బృందానికి మద్దతు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+