మా పోలింగ్ లో ఉద్రిక్తత : రెండు వర్గాల మధ్య ఘర్షణ- ఇద్దరి అభ్యర్ధులతో అధికారుల చర్చలు: పోలింగ్ కొనసాగేనా..!!
ఉత్కంఠ పరిస్థితుల్లో మొదలై...ప్రశాంతంగా ప్రారంభమైన మా ఎన్నికల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయటం పైన రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. పోలింగ్ కేంద్రంలో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నారంటూ మొదలైన వివాదం తరువాత దూషణలకు కారణమైంది. బెనర్జీ పైన మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నికల్లో తేడా వస్తే సహించనంటూ హెచ్చరించారు. సమీర్ పైన శివబాలాజీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరగటంతో రెండు శిబిరాల సభ్యుల మధ్య ఘర్షణ మొదలైంది.

పోలింగ్ సమయంలో రిగ్గింగ్ ఆరోపణలతో
రెండు క్యాంపులకు చెందిన సభ్యులు సీరియస్ అయ్యారని చెబుతున్నారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న శివబాలాజీ - హేమ మధ్య సైతం వాగ్వాదం చోటు చేసుకుందని సమాచారం. వారద్దరి మధ్య ఘర్షణతో ఏడుస్తూ బయటకు వచ్చిన హేమను విష్ణు ఓదార్చారు. రిగ్గింగ కు పాల్పడుతున్నారంటూ ఒక వర్గం పైన మరో వర్గం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీంతో..ఎన్నికల అధికారి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవసరమైతే మా ఎన్నికల పైన కోర్టుకు వెళ్తామన్నారు. సీసీ ఫుటేజ్ చూసిన తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.

ఎన్నికల అధికారుల చర్చలు
అయితే, లోపల జరుగుతున్న పరిణామాల పైన హీరో సుమన్ స్పందించారు. లోపల అంతా అరుపులు కేకలతో గందరగోళంగా ఉందని చెప్పుకొచ్చారు. రెండు వర్గాల మద్దతు దారులు పోలింగ్ కేంద్ర బయట సైతం ఘర్షణ కు దిగటంతో తోపులాట చోటు చేసుకుంది. నాన్ మెంబర్ వచ్చి లోపల ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా ప్రచారం చేస్తుంటే... నరేశ్ పట్టుకొన్నారు. ఎవరో తెలుసుకోవాలి..మాస్కు తీయమని అడగ్గా.. ఆయన బయటకు పరుగులు తీసారని..మోత్తం పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి చెప్పుకొచ్చారు.

పోలింగ్ ఆగుతుందా..సాగుతుందా
ఆ వ్యక్తి రిగ్గింగ్ కు వచ్చారనే ఆరోపణలతో ఈ ఘర్షణ మొదలైంది. దీంతో..విష్ణు శిబిరం పట్టుకున్న ఆ వ్యక్తిని ఎన్నికల సిబ్బంది విచారిస్తున్నారు. రిగ్గింగ్ జరిగినట్లు తేలితే ఎన్నికలు నిలిపివేస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేసారు. దీంతో..ఇప్పటికే బరిలో ఉన్న విష్ణు - ప్రకాశ్ రాజ్ తో ఎన్నికల అధికారి చర్చలు కొనసాగిస్తున్నారు. దీంతో అసలు మా పోలింగ్ సాగుతుందా లేదా అనే టెన్షన్ ఇప్పుడు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications