ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆరుగురి మృతి, ఇద్దరికీ తీవ్రగాయాలు
పాల్ఘర్ జిల్లాలోని దహాను వద్ద రెండు కార్లు ఓ మోటారు సైకిలు పరస్పరం ఢీ కొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన మరో ఇద్దరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలతో పాటు గాయపడ్డవారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు అధికారి హేమంత్ కట్కార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications