BJP:తెలంగాణలో పాతుకుపోవడమే టార్గెట్.. 27 జిల్లాలకు అధ్యక్షులు ఖరారు
BJP: తెలంగాణలో పాతుకుపోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం షురూ అయింది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు నేడు 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జాబితాను బీజేపీ విడుదల చేసింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..
1.హైదరాబాద్- లంక దీపక్ రెడ్డి
2. జయశంకర్ భూపాలపల్లి - నిశిధర్ రెడ్డి
3.కామారెడ్డి- నీలం చిన్న రాజులు
4. హనుమకొండ-కొలను సంతోష్ రెడ్డి
5.వరంగల్-గంట రవి కుమార్
6.నల్గొండ-నాగం వర్షిత్ రెడ్డి
7.జగిత్యాల-రాచకొండ యాదగిరి బాబు
8.జనగామ-సౌడ రమేష్
9.నిజామాబాద్-దినేష్ కులాచారి
10.వనపర్తి-నారాయణ
11. మేడ్చల్ -శ్రీనివాస్
12-కుమురంభీం ఆసిఫాబాద్ - శ్రీశైలం ముదిరాజ్
13. ములుగు -బలరాం
14. మహబూబ్ నగర్-శ్రీనివాస్ రెడ్డి
15. మంచిర్యాల-వెంకటేశ్వర్లు గౌడ్
16.పెద్దపల్లి -సంజీవ రెడ్డి
17.ఆదిలాబాద్-బ్రహ్మానందరెడ్డి
18. సికింద్రాబాద్-భరత్ గౌడ్

మరికొన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకంపై తెలంగాణ పార్టీ ఇంచార్జి సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిని ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియమిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడైన కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఆ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లుగా సమాచారం. చాలా చర్చల అనంతరం ఈటల రాజేందర్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు నేతలు కూడా చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications