మునుగోడులో బీజేపీ ప్రచారాల మోత; నేడు రంగంలోకి దూకుతున్న బండి సంజయ్, డీకే అరుణ
మునుగోడు ఉప ఎన్నికల పోరు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలన్నీ మునుగోడులో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోసం మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కోసం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

మునుగోడు ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం బీజేపీరాష్ట్రస్థాయి నేతలు,జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
ఇక నేడు మునుగోడులో బిజెపి రాష్ట్ర స్థాయి హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బండి సంజయ్ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగటం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుంది.

బండి సంజయ్ నేటి ప్రచార షెడ్యూల్ ఇలా
నేటి నుండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బండి సంజయ్ నేడు ఉదయం 11 గంటలకు తిరు గుండ్లపల్లి, థమ్మాడపల్లి గేట్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అజలాపురం, ఎరగండ్లపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 12 గంటల 30 నిమిషాలకు కొండూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఆ పై నాలుగు గంటలకు మర్రిగూడ క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొంటారు.

చండూరు మండలంలో డీకే అరుణ ఎన్నికల ప్రచారం, చౌటుప్పల్ లో ఈటల రాజేందర్
ఇక బండి సంజయ్ తో పాటు నేడు ఎన్నికల ప్రచార బరిలోకి బీజేపీ సీనియర్ నాయకురాలు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ రంగంలోకి దిగుతున్నారు. డీకే అరుణ ఎన్నికల ప్రచారాన్ని చూస్తే నేడు చండూరు మండలం లో డీకే అరుణ తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. చండూరు మండలం లోని కొండాపూర్ లో 11 గంటలకు, నెర్మట్టలో 12 గంటలకు, దోని పాముల లో నాలుగు గంటలకు, జోగి గూడెం లో 6 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని డీకే అరుణ చేయనున్నారు . ఇక చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తంగడ్ పల్లి లోని 4, 5, 6, 14, 15 వార్డులలో ప్రచారం నిర్వహించనున్నారు.

బీజేపీ ఎన్నికల ప్రచారంలో బాబు మోహన్ .. మోగనున్న బీజేపీ ప్రచారాల మోత
నేడు బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో మునుగోడు మండలంలో బాబు మోహన్ పాల్గొననున్నారు. మునుగోడు మండలం లోని చల్మెడ, వెల్మకన్న, రాయి గూడెం, జక్కల వారి గూడెం, కచరా పురం లలో బాబు మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రచార పర్వంలో బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు 11మంది ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రతి మండలంలోని రోడ్ షో లు, బహిరంగ సభలతో మునుగోడులో ప్రచారాల మోత మోగించనున్నారు
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications