Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత.. భగ్గుమన్న బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. రేపు పోలింగ్ కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈ సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు బిజెపి అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప నేడు తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత

ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్ల ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు, కుటుంబ సభ్యులు, బిజెపి శ్రేణులు చెబుతున్నారు. మహదేవప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో వేలాదిగా బిజెపి కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. దీంతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

BJP candidate Mahadevappa suicide tension in maktal municipality bandi sanjay fires on congress

మహాదేవప్ప మృతిపై భగ్గుమన్న బండి సంజయ్

ఈ క్రమంలో మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని, అరాచకాలు తట్టుకోలేక మహదేవప్ప ప్రాణాలు విడిచాడు అని అన్నారు. కాంగ్రెస్ ను రాళ్ళతో కొట్టే పరిస్థితి రాబోతుందని ఆయన పేర్కొన్నారు. మా సహనాన్ని పిరికితనం గా భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పైన యుద్ధం చేయబోతున్నాం

ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పైన యుద్ధం చేయబోతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలారా....ధైర్యంగా ఉండండి, బిజెపి నాయకత్వం మీకు అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయాలి

మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బయలుదేరారన్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+