వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ భారీ వ్యూహం - ఇతర రాష్ట్రాల కమ్యూనిటీలతో సమావేశం : ఎవరు ఎవరితో - లక్ష్యం ఫిక్స్...!!

|
Google Oneindia TeluguNews

జాతీయ సమావేశాల నిర్వహణ సమయంలో బీజేపీ భారీ వ్యూహం అమలు చేస్తోంది. హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన ఆయా రాష్ట్రాలకు చెందిన వారితో ప్రత్యేకంగా కమ్యూనిటీ సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు - కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. జూలై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
జులై ఒకటో తేదీన హర్యానా ప్రాంతానికి చెందిన వారితో ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ కట్టర్ సమావేశం జరిగేలా ప్రణాళికలు సిద్దం చేసారు.

ఏ రాష్ట్ర ప్రజలతో ఆ రాష్ట్ర నేతల సమావేశం

ఏ రాష్ట్ర ప్రజలతో ఆ రాష్ట్ర నేతల సమావేశం

తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న ప్రాంతీయుల తో సైతం సమావేశం ఏర్పాటు చేసారు. వారితో సినీ నటి - బీజేపీ నాయకురాలు కుషుబుూ, అన్నామలైతో పాటుగా మురుగన్ సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు కోరుతూ వీరు వారితో సమావేశాలు నిర్వహించనున్నారు. తమిళ కమ్యూనిటీ సమావేశం నేరేడ్ మెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసారు. ఇక, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కు చెందిన గుజరాతీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. గుజరాత్ భవన్ రామ్ కోటి లో గుజరాతీ ల సమావేశంలో సీఎం భూపెంద్ర పటేల్, విజయ్ రుపాని పాల్గొంటారు. మద్య ప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ పాల్గొంటార. కూకట్ పల్లి లో ఈ సమావేశం జరగనుంది.

ఎగ్జిక్యూటివ్ సమావేశాల సమయంలోనే

ఎగ్జిక్యూటివ్ సమావేశాల సమయంలోనే


రాజస్థాన్ కమ్యూనిటీ తో రెండు సమావేశాలు ఏర్పాటు చేసారు. శంషాబాద్ లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హల్ తో పాటుగా అదే రోజు సాయంత్రం నాంపల్లిలోని క్వాలిటీ ఇన్ ఏర్పాటు చేసిన సమావేశాలకు వసుంధర రాజే హాజరు అవుతారు. పంజాబీలతోనూ ప్రత్యేకంగా సమావేశం ఫిక్స్ చేసారు. వీరితో బ్లూ ఫాక్స్ హోటల్ మీటింగ్ ఫిక్స్ అయింది. ఇక, జూలై 2న ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో మాదాపూర్ తో పాటుగా బంజారా హిల్స్ లో సమావేశాలు ఏర్పాటు అయ్యాయి. వీటికి అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ హాజరు అయి..వారిని బీజేపీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. ఆయనతో పాటుగా.. ఈశాన్య రాష్ట్రాల సీఎం లు హాజరవుతారు. ఇక.. పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రాంతీయులతో ఆ రాష్ట్ర సీఎం సమావేశమవుతారు. కర్ణాటక సాహిత్య మందిర్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసారు.

బీజేపీకి మద్దతు కోరుతూ - వర్కవుట్ అవుతుందా

బీజేపీకి మద్దతు కోరుతూ - వర్కవుట్ అవుతుందా


అదే రోజున హైటెక్స్ సిటీలో కాశ్మీర్ పండిట్స్ తోనూ సమావేశం ఫిక్స్ చేసారు. కేరళకు చెందిన మళయాలీ సమావేశం మల్కాజ్ గిరీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసారు. ఇందులో మురళీ ధరన్ తో పాటుగా కృష్ణదాస్ పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్య క్రమంలో ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో ప్రత్యేకంగా ఇలా సమావేశాలు నిర్వహించటం ద్వారా రానున్న ఎన్నికల్లో వారి మద్దతు పొందవచ్చని భావిస్తోంది. అయితే, ఇలా.. ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీల సమావేశాల నుంచి బీజేపీకి ఎటువంటి స్పందన వస్తుంది.. ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనేది వేచి చూడాలి.

English summary
At the time of BJP national Execurtive Committee mettings, reaches out to people from other states living in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X