చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం బీజేపీ సోదరా!!
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ, మొత్తంగా చూస్తే బిజెపి స్వయంకృత అపరాధం తో తెలంగాణలో మంచి అవకాశాన్ని జారవిడుచుకుంది. ఇప్పుడు బండి సంజయ్ ని తొలగించిన తర్వాతే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం వల్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలలో సత్తా చాట లేకపోయిందని బిజెపి నేతలు టార్గెట్ చేస్తున్నారు.
బండి సంజయ్ సారధ్యంలో ఫామ్ లో ఉన్న బీజేపీ, అధ్యక్షుడిని మార్చి అధిష్టానం తప్పు చేసిందని, కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించటం కూడా అతిపెద్ద తప్పిదం అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో బండి సంజయ్ ను మార్పు చెయ్యకుండా ఎన్నికలకు వెళ్లి ఉంటే బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపించేదని కూడా భావిస్తున్న వారు లేకపోలేదు.

ప్రజలు మార్పు కోరుకున్నారని బీఆర్ఎస్ మాకొద్దు అని డిసైడ్ చేసుకున్నారని, బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చేదని ఇప్పుడు బిజెపి నేతలు లబోదిబోమంటున్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఈ మేరకు బండి సంజయ్ ను మార్చడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కనీసం సికింద్రాబాద్లో కూడా అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారని పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అసమర్థతకు కారణమని మండిపడుతున్నారు.
కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేటలో కూడా బిజెపి అభ్యర్థి కృష్ణ యాదవ్ ఓటమిపాలు కావడం కిషన్ రెడ్డి ఫెయిల్యూర్ కు నిదర్శనమని వారు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి పేలవమైన ప్రదర్శనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అసమర్థత కారణమని భగ్గుమంటున్నారు. ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? అని బిజెపి తీరు చూస్తున్న వారంతా తెలంగాణలో బిజెపి పరిస్థితిని గురించి చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications