వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా రాజకీయాలపై బీజేపీ అగ్రనేతల ఫోకస్ .. నడ్డా, అమిత్ షాల పర్యటనల అజెండా ఇదే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాలపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు రంగంలోకి దిగుతున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రంగంలోకి దించుతుండగా, మరోపక్క బిజెపి అగ్రనాయకులు ఒక్కొక్కరుగా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.

తెలంగాణాలో రంగంలోకి బీజేపీ అగ్రనాయకులు

తెలంగాణాలో రంగంలోకి బీజేపీ అగ్రనాయకులు

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడానికి శ్రీకారం చుట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ పనితీరును ప్రశ్నిస్తూ, కెసిఆర్ కుటుంబ పాలనను నిలదీస్తున్నారు. ఇక దూకుడు మీద ఉన్న తెలంగాణ బీజేపీ నేతలకు అండగా అగ్ర నాయకులు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు.

మే5 న పాలమూరుకు జేపీ నడ్డా రాక .. షెడ్యూల్ ఇదే

మే5 న పాలమూరుకు జేపీ నడ్డా రాక .. షెడ్యూల్ ఇదే

మే 5వ తేదీన పాలమూరుకు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు జేపీ నడ్డా . నోవాటెల్ హోటల్ లో మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రోడ్డు మార్గంలో మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 8గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి రాత్రికి నోవాటెల్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్తారు.

 మే 14వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన

మే 14వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా సైతం మే 14వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో నిర్వహించే రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం తో పాటుగా, ఎన్నికల ఎజెండాను ఖరారు చేయడం పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని బలమైన సందేశాన్ని ఇవ్వడం లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

ఎన్నికల అజెండాతో బీజేపీ

ఎన్నికల అజెండాతో బీజేపీ

గురువారం పాలమూరు బహిరంగ సభ ద్వారా బిజెపి తెలంగాణ రాష్ట్రంపై తన స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయనుందని సమాచారం. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల కోసం బిజెపి భరోసా పేరుతో, రాష్ట్రంలో ప్రజల పరిస్థితులను చెప్పి, బిజెపి వారికి ఏ విధంగా అండగా నిలవబోతుందో చెప్పే ప్రయత్నం చేస్తారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఆపై జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లుగా సమాచారం.

టీఆర్ఎస్ కు చెక్ పెట్టే వ్యూహంలో బీజేపీ

టీఆర్ఎస్ కు చెక్ పెట్టే వ్యూహంలో బీజేపీ


ఇప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ చేసి ప్రజాక్షేత్రంలోకి పార్టీని బలంగా తీసుకు వెళితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టొచ్చని, అలాగే దేశ రాజకీయాలలోనూ మరోమారు చక్రం తిప్పొచ్చు అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణా సీఎం కెసీఆర్ కూడా కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిల దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న బిజెపి ఇప్పుడు తన ప్రధానమైన దృష్టిని తెలంగాణ రాష్ట్రంపై పెట్టడం గమనార్హం.

English summary
Top BJP leaders focus on Telangana politics. JP Nadda and Amit Shah will be touring the state of Telangana as part of the upcoming election agenda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X