తెలంగాణాలో బీజేపీ హైకమాండ్ రహస్యసర్వేలు.. బండి సంజయ్ పై ఒత్తిడి; ఆ నేతలకు టెన్షన్!!
తెలంగాణ రాష్ట్రం పై బిజెపి అధినాయకత్వం దృష్టి సారించిందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడానికి సన్నాహాలు చేస్తోందా? జాతీయ నాయకులను రంగంలోకి దించటంతో పాటు పార్టీ పరిస్థితి పై రహస్య సర్వేలను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని తెలుసుకుంటోందా? రాష్ట్ర స్థాయి నాయకులనుండి జిల్లాస్థాయిలో నాయకుల వరకు, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారి వరకూ ప్రతి ఒక్కరి పనితీరును గమనిస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

తెలంగాణాపై బీజేపీ ఫోకస్..
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా ఫోకస్ లేని జాతీయ బిజెపి నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. కాస్త కష్టపడితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకు రావచ్చు అన్న భావనకు వచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన దూకుడు చూసి, బిజెపి అధినాయకత్వానికి తెలంగాణ పై ఫోకస్ చేయడానికి మరింత బలం దొరికినట్లైంది.

రహస్య సర్వేలు చేస్తున్న బీజేపీ హైకమాండ్
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి, వివిధ కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టడానికి బిజెపి అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని, క్షేత్ర స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను, జిల్లాలో అధ్యక్షుల పని తీరును బీజేపీ హైకమాండ్ రహస్య సర్వేలు నిర్వహిస్తూ తెలుసుకుంటోంది. బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతం అయినప్పటికీ, కేంద్ర పెద్దలకు ఇంకా మిగిలిన నాయకుల పనితీరు విషయంలో పెద్దగా సంతృప్తి కలగడం లేదనేది తాజాగా బీజేపీ అధిష్టానం వివిధ సమావేశాలలో చెబుతున్న అంశాలను బట్టి తెలుస్తుంది.

బీజేపీ అనుబంధ కమిటీలలోని మోర్చాల పనితీరుపై అసంతృప్తి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వివిధ జిల్లాలలో పరిస్థితి ఏంటి అన్న అంశంపై రహస్య సర్వేలు నిర్వహిస్తున్న బీజేపీ అధిష్టానం సర్వే ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ అనుబంధ కమిటీలలోని వివిధ మోర్చాల పనితీరుపై బీజేపీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఒకటి రెండు మోర్చాల పనితీరు మరీ అధ్వానంగా ఉందని బీజేపీ పెద్దలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక బిజెపి జిల్లా అధ్యక్షుల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉందని సర్వే నివేదికలు వెల్లడించాయి అని తెలుస్తుంది.

నామమాత్రంగా కొందరు నాయకులు పని చేస్తున్నట్టు గుర్తించిన అధిష్టానం
టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేయడంలో, స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో బిజెపి నాయకులు ఆసక్తి చూపించడం లేదని, నామమాత్రంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లుగా బీజేపీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర కమిటీ ఏదైనా పిలుపునిస్తే దానిని పూర్తి చేయడానికి కూడా బిజెపి నాయకులు అంత ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఇక కొద్దిరోజుల క్రితం బిజెపి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం జిల్లా అధ్యక్షుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. పార్టీ పదవిలో ఉన్నవారు పని చేయకుండా హైదరాబాదులో ఉంటే ఇబ్బంది ఎదురవుతుందని పదే పదే హెచ్చరిస్తున్నట్లు గా సమాచారం.

రహస్య సర్వేల ఆధారంగా పార్టీ ప్రక్షాళన పై దృష్టి... పనిదొంగలకు టెన్షన్
ఇక క్షేత్రస్థాయిలో బీజేపీ హైకమాండ్ నిర్వహించిన రహస్య సర్వేల ఆధారంగా పార్టీ ప్రక్షాళన పై దృష్టి సారించాలని భావిస్తున్నారు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పదవుల్లో ఉండి నామమాత్రంగా పనిచేస్తున్న నేతలకు వెన్నులో వణుకు పుడుతోందని తెలుస్తోంది. తమ పదవులకు ఎసరు వస్తుందా అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నట్లు గా తెలుస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుంటున్న బిజెపి అధినాయకత్వం ఈసారి ఇప్పటి నుండే పార్టీపై పూర్తిగా ఫోకస్ పెట్టడం పార్టీ కోసం పని చేసే నాయకులకు సంతోషాన్ని కలిగిస్తే, పని చేయని దొంగలకు మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications