తెలంగాణా బీజేపీ పనితీరుపై గ్రౌండ్ రియాలిటీ చెక్ చెయ్యనున్న హైకమాండ్.. కొత్త ప్రయోగం!!

తెలంగాణా బీజేపీ పనితీరుపై గ్రౌండ్ రియాలిటీ చెక్ చెయ్యనున్న హైకమాండ్ కొత్త ప్రయోగం చేస్తుంది. దీంతో తెలంగాణా బీజేపీ నేతలకు కొత్త పరేషాన్ వచ్చి పడింది.

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంది. అయితే ప్రజాక్షేత్రంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రజలలోకి బిజెపి నాయకులు బలంగా వెళుతున్నారా? క్షేత్రస్థాయిలో పార్టీ ఏ మేరకు బలోపేతం అవుతుంది? వంటి అంశాలపై దృష్టి సారించిన బిజెపి అధినాయకత్వం, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ పరిశీలన చేయడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ యాప్ ద్వారా కార్యక్రమం ఏ విధంగా జరిగింది అన్నదానిపై గ్రౌండ్ రియాలిటీ చెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణాలో బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం కీలక నిర్ణయం

తెలంగాణాలో బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకులు వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నారు. అయితే తాము ప్రజల్లోకి బలంగా వెళుతున్నామని, ప్రజలు తమ ఆదరిస్తున్నారని బిజెపి నేతలు అధిష్టానానికి చెబుతుండగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించిన బిజెపి అగ్రనాయకత్వం గాలిలో కాదు గ్రౌండ్లో పనిచేయాలని నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇకపై అన్ని కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు ఆ యాప్ లో

ఇకపై అన్ని కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు ఆ యాప్ లో

ఈ క్రమంలోనే గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయడానికి ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ యాప్ ద్వారా బిజెపి నేతలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించనున్నారు. తమ తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను బాగా ఘనంగా నిర్వహించామని ఇప్పటి వరకు నేతలు అధినాయకత్వానికి మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేసేవారు. అయితే ఇక ఎవరేం చెప్పినా వినబోమని, పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం నిర్వహించినా కచ్చితంగా ఫోటోలు, వీడియోలు యాప్ లో అప్లోడ్ చేయాలని బిజెపి అధినాయకత్వం సూచించిందని సమాచారం .

బీజేపీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా యాప్ లో అప్లోడ్ చెయ్యాల్సిందే

బీజేపీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా యాప్ లో అప్లోడ్ చెయ్యాల్సిందే

ఇక పార్టీ పెద్దలు ఏ కార్యక్రమం జరిగినా ఎంత బాగా జరిగింది? ఎంత బాగా నిర్వహించారు? అనేది యాప్ లోనే చూడనున్నట్టు తెలుస్తుంది. పార్టీ నేతలంతా కూడా ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి చోట జరిగిన బిజెపి కార్యక్రమాలను, వారు నిర్వహించిన తీరును చూడొచ్చని చెబుతున్నారు. ఈ యాప్ ఆపరేషన్ యాక్సెస్ ఉన్నవారు తమ తమ పరిధిలో జరిగిన కార్యక్రమాల వివరాలను, వాటికి సంబంధించిన ఫోటోలను యాప్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించినట్లుగా సమాచారం .ఇప్పటికే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగింది ఎవరెవరు పాల్గొన్నారు ఫోటోలు తీసి బిజెపి యాప్ లో అప్లోడ్ చేశారట తెలంగాణ బిజెపి నేతలు.

త్వరలో జరగనున్న కార్నర్ మీటింగ్స్ కూడా యాప్ లో

త్వరలో జరగనున్న కార్నర్ మీటింగ్స్ కూడా యాప్ లో

ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో బిజెపి నిర్వహించాలని భావిస్తున్న కార్నర్ మీటింగ్లను కూడా బాగా నిర్వహించి, వాటిని కవర్ చేసి యాప్ లో అప్లోడ్ చేయాలని బిజెపి అగ్ర నాయకత్వం చేసిందని సమాచారం. దీనికోసం ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్చార్జిలను బిజెపి నాయకులు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక యాప్ ద్వారా తాము చేసిన కార్యక్రమాలను అధిష్టానానికి చూపించడానికి కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే క్రమంలోనే బీజేపీ ఈ నిర్ణయం

గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే క్రమంలోనే బీజేపీ ఈ నిర్ణయం

కొందరు ఈ విధానం పట్ల అసహనం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు యాప్ లో ఫోటోలు అప్లోడ్ చేయడం కోసమైనా కార్యక్రమాన్ని కచ్చితంగా నిర్వహించి తీరాల్సిందేనని చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో నేతలు చెబుతున్న విషయాలను నమ్మని బిజెపి అగ్రనాయకత్వం ప్రతిదీ గ్రౌండ్ రియాలిటీ చేయాలని నిర్ణయించుకొని, తామే స్వయంగా యాప్ ద్వారా పనితీరును అంచనా వేయనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+