మహిళలను అవమానించింది బీజేపీనే, ముందు పార్టీలో అసమ్మతి చూసుకో: బండికి మంత్రి హరీష్ రావు కౌంటర్
తెలంగాణ గవర్నర్ మహిళ కాబట్టి ఆమెను బడ్జెట్ సమావేశాలలో ప్రసంగించకుండా అవమానిస్తున్నారని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఎదురుదాడికి దిగారు. మహిళలను అవమానించే సంస్కృతి బిజెపి నేతలకే ఉందని ఆయన ఆరోపించారు. గవర్నర్ ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్న బీజేపీ నేతలను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని హరీష్ రావు పేర్కొన్నారు.

మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసేది మీరే
టిఆర్ఎస్ ఎల్ పి లో మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన మంత్రి హరీష్ రావు మోడీ ప్రధానమంత్రి కాగానే గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ ను డిస్మిస్ చేశారని గుర్తు చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అందరూ మాతృమూర్తులని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అస్సాం సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.

రాజ్ భవన్ కు కాషాయ రంగు పులుముతారా?
మహిళా సీఎం మమతా బెనర్జీని బీజేపీ గవర్నర్ ను అడ్డంపెట్టుకుని వేధించటం లేదా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. గవర్నర్ ను అవమానించే ఉద్దేశమే మాకు లేదని మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు. ఇక బేటీ బచావో బేటీ పడావో నిధులు 80% మోదీ ప్రచారానికి ఖర్చు పెట్టారని పార్లమెంటు స్థాయీ సంఘం చెప్పిందని హరీష్ రావు పేర్కొన్నారు. అసలు మహిళలను ఎవరు అవమాన పరుస్తున్నారో ప్రజలందరికీ తెలుస్తుందని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది బీజేపీ నేత లేనని పేర్కొన్న హరీష్ రావు రాజ్ భవన్ కు కాషాయ రంగు పులుముతున్నారంటూ మండిపడ్డారు.

గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీజేపీ దుర్వినియోగం
అవగాహన లేకుండా బిజెపి నేతలు కోర్టుకు వెళతాం అంటున్నారని విమర్శించారు. శాసనసభకు ఉన్న హక్కులు బండి సంజయ్ కు తెలియదా అంటూ ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ కు గౌరవం ఉందని పేర్కొన్న హరీష్ రావు సీఎం కేసీఆర్ గతంలో గవర్నర్ నరసింహన్ ను, ఇప్పటి గవర్నర్ తమిళిసై ను గౌరవిస్తున్నారని వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని అనేక రాష్ట్రాల్లో బీజేపీ దుర్వినియోగానికి పాల్పడుతోందని, బలం లేకున్నా అనేక రాష్ట్రాలలో అర్ధరాత్రి సీఎంలతో ప్రమాణస్వీకారం చేయించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అని హరీష్ రావ్ చురకలంటించారు.

బీజేపీకి మహిళల గురించే మాట్లాడే నైతిక హక్కు లేదు
గవర్నర్ కు ఇబ్బంది ఉంటే సీఎం కేసీఆర్ తో, సెక్రటరీ తో మాట్లాడతారని హరీష్ రావు పేర్కొన్నారు. గవర్నర్ ను అడ్డంపెట్టుకుని సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నట్లు బిజెపి నేతలే బయట పడుతున్నారని విమర్శించారు హరీష్ రావు. చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేయడం సరికాదని హరీష్ రావు హితవు పలికారు. ప్రోరోగ్ కాలేదు కనుకనే గవర్నర్ ను పిలవలేదని హరీష్ రావు తెలిపారు. మాతృమూర్తులని అవమానించే బిజెపికి మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని హరీష్ రావ్ తేల్చిచెప్పారు.

బండి సంజయ్ మీద పార్టీలోనే అసమ్మతి.. ముందు వాటి సంగతి చూసుకో
బీజేపీ వెలుగునివ్వని దీపమని, టిఆర్ఎస్ ప్రభుత్వం దారిచూపే కాగడా అని హరీష్ రావు పేర్కొన్నారు. బండి సంజయ్ ఓ సారి రాజ్యాంగాన్ని చదువుకోవాలని హితవుపలికారు. బండి సంజయ్ మీద ఆ పార్టీలోనే అసమ్మతి ఉందని తెలంగాణ బీజేపీ లో రహస్య సమావేశాలు జరుగుతున్నాయట.. అని పేర్కొన్న హరీష్ రావు ముందు వాటి సంగతి ఏంటో చూసుకోవాలని హితవు పలికారు. బండి సంజయ్ ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలని సూచించారు. బండి సంజయ్ ను ఢిల్లీ పిలిపించి పార్టీ హైకమాండ్ మొట్టికాయలు వేసినట్టు చెప్పుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications