ఎన్నికల సమరానికి బీజేపీ రెడీ.. అమావాస్య తర్వాత అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్!!
తెలంగాణ బిజెపి ఎన్నికల సమరానికి రెడీ అవుతుంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసి వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని రకరకాల వ్యూహాలతో బి ఆర్ ఎస్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతలలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది బిజెపి.
లోక్సభ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న క్రమంలో బిజెపి లోని ముఖ్య నేతలను బరిలోకి దింపాలని రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు ఆలోచిస్తున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటు, బి ఆర్ ఎస్ ముఖ్య నేతలు పోటీ చేసే చోట బిజెపి నుంచి మంచి పేరున్న ముఖ్యమైన నాయకులను బరిలోకి దించాలనే ఆలోచనలో అధినాయకత్వం ఉంది.

ఇందుకు సంబంధించిన కసరత్తులు చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈనెల 15 లేదు 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఈనెల 14వ తేదీ అమావాస్య కావడంతో పాటు, పితృ పక్షాలు ఉండడంతో అవి ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది.
ఈ మేరకు ఇప్పటికే 38 స్థానాలకు అభ్యర్థులపై చర్చ జరిగింది. ఈ భేటీలో 21 స్థానాలలో అభ్యర్థుల పేర్ల పై స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మిగతా 17 సీట్ల అభ్యర్థుల పైన కూడా కసరత్తు పూర్తవుతుందని అమావాస్య తర్వాత మంచి రోజు చూసుకొని బిజెపి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా దూకుడు పెంచుతున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే బి ఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో, వారిని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులను ఎన్నికల బరిలోకి దింపాలని తీవ్ర కసరత్తులు చేస్తుంది. మరి బీజేపీ చేసే ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలనిస్తాయి. వచ్చే ఎన్నికలలో బిజెపి పట్టు దక్కించుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications