తెలంగాణ ముంద‌స్తు పై అమీత్ షా న‌జ‌ర్..!

హైద‌రాబాద్: కేసీఆర్.. 2009 నుండి ఆ మూడ‌క్ష‌రాల‌కు ఉపోద్గాతం అవ‌స‌రం లేకుండాపోయింది. ఆరేళ్ల పిల్లాడి నుండి 60ఏళ్ల వ్రుద్దిడి వ‌ర‌కు ఆ మూడ‌క్ష‌రాల ప‌ట్ల ఎన్నోఏళ్ల అనుబంధాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. 2014లో అదే సెంటిమెంట్ తో తెలంగాణ ప్ర‌జానికం ఆయ‌న‌ని గుండెల్లో పెట్టుకున్నారు. ఐతే ముఖ్య‌మంత్రిగా ఐదేళ్లు పూర్తిచేసుకోక ముందే అసెంబ్లీని ర‌ద్దు చేయడం, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను తెలుసుకుని ముంద‌స్తుకెళ్లారా..? లేక గ్ర‌హ‌బ‌లం కోసం ముందప్తుకెళ్లారా అనే అంశం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఐతే కేసీఆర్ క‌ద‌లిక‌ల ప‌ట్ల‌, తెలంగాణ ఎన్నిక‌ల ప‌ట్ల కేంద్ర బీజేపి పెద్ద‌లు ఓ క‌న్నేసి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాజ‌కీయాల ప‌ట్ల అమీత్ షా ఆస‌క్తి..! త్వ‌ర‌లో రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌..!!

తెలంగాణ రాజ‌కీయాల ప‌ట్ల అమీత్ షా ఆస‌క్తి..! త్వ‌ర‌లో రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌..!!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. దీంతో జాతీయ నేత‌ల దృష్టి ఇప్పుడు రాష్ట్రంపై ప‌డింది. ఏక‌ప‌క్షంగా పాల‌న చేస్తున్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని పార్టీ నేతలతో అమిత్ షా స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. డిసెంబరులో ఎన్నికలు జరిగే రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్ గఢ్.. రాష్ట్రాలకు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబ‌ట్టి అక్క‌డ ప్రచార బాధ్యతలుపై పెద్ద‌గా శ్ర‌ద్ద చూపించాల్సిన అవ‌స‌రం లేదు.
అంతే కాకుండా బీజేపీ ప‌టిష్టంగా ఉండ‌టంతో అమిత్ షా త‌న‌ స‌మ‌యాన్ని అధికంగా తెలంగాణ పై పెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తానే స్వయంగా రంగంలోకి దిగి ప్ర‌చార వ్య‌వ‌హారాలు ప‌రిశీలించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల‌కు అమీత్ సందేశం పంపిన‌ట్టు స‌మాచారం.

ఇక తెలంగాణ ప్ర‌తిష్టాత్మ‌కం..! అదికారమే ల‌క్ష్యం అంటున్న క‌మ‌లం బాస్..!!

ఇక తెలంగాణ ప్ర‌తిష్టాత్మ‌కం..! అదికారమే ల‌క్ష్యం అంటున్న క‌మ‌లం బాస్..!!

తెలంగాణలో పార్టీ విజయంపై షా ధీమాతో ఉన్నాట్టు ఆ పార్టీ తెలంగాణ నేత‌లు చెప్పుకొస్తున్నారు. పార్టీ వ‌ర్గాల‌తో మాట్లాడుతూ ఎలాంటి క్యాడర్ లేని త్రిపురలోనే పక్కా వ్యూహంతో విజయం సాధించామని, అలాంటప్పుడు బలమైన కేడర్ ఉన్న తెలంగాణలో విజయం ఎందుకు సాధ్యం కాదన్న మాటను షా సంధిస్తున్నట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ తో సీరియస్ ఫైట్ చేయనున్నామని, పార్టీ నేతలు తమ వంతుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 90 రోజుల పాటు 119 నియోజకవర్గాల్లో సభలను ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన ఈ నెల 12 లేదా 15 నుంచి మహబూబ్ నగర్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిద్దామని చెప్పినట్టు సమాచారం.

ఆరు నెలల్లో ఎన్నికలు రాక‌పోతే గులాబీ పార్టీకి ద‌బ్బ‌..! మోదీ, అమీత్ షా ఏదైనా చేయొచ్చు..!!

ఆరు నెలల్లో ఎన్నికలు రాక‌పోతే గులాబీ పార్టీకి ద‌బ్బ‌..! మోదీ, అమీత్ షా ఏదైనా చేయొచ్చు..!!

టిఆర్ఎస్ పూర్తిగా బీజేపీని నమ్మి ఎన్నికల బరిలో నిలిస్తే అనుకున్న సమయానికి ఎన్నికలు జరగొచ్చు,జరగక పోవచ్చు.ఇది టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ కానుంది. 6 నెలల పాటు సీఎం కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగుతారు.ఈ లోపు ఎన్నికలు రాకుంటే తర్వాత రాష్ట్రపతి పాలనకు అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్,టిఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండనుంది. బీజేపీ తెలంగాణ లో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి సారించారు. ఇప్పుడు బీజేపీ టార్గెట్ తెలంగాణ లో అధికారంలోకి రావడం. రావాలంటే టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టడం వారి ప్రధాన ఎజెండా. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఒక్కొక్కటిగా క్లిన్ స్వీప్ చేస్తూ వస్తోంది. తెలంగాణ‌లో అదికార పార్టీని దెబ్బ‌కొట్టేందుకు కేసీఆర్ ముంద‌స్తు అస్త్రాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కాషాయ ద‌ళాలు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ప్ర‌జాక్షేత్రంలో క‌మ‌ల నేత‌లు..! కేసీఆర్ తో ఢీ అంటే ఢీ..!!

ఇక ప్ర‌జాక్షేత్రంలో క‌మ‌ల నేత‌లు..! కేసీఆర్ తో ఢీ అంటే ఢీ..!!

మోడీ-అమిత్ షాల కన్ను ఎప్పటి నుండో తెలంగాణ‌ పై ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకున్నా అధికారం లాక్కుంది. అయితే దేశ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటుంది. టిఆర్ఎస్ తర్వాత రాష్ట్రంలో బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే కేంద్రంలో అధికారం లో ఉండడం బీజేపీకి కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవడానికి టిఆర్ఎస్ నాయకులపైనే గురిపెట్టింది బీజేపీ. టిఆర్ఎస్ నుంచి అధికారాన్ని లాక్కోవడానికి దేనికైనా సిద్ధంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కీలక వ్యక్తుల పైన ద్రుష్టి కేంద్రీక‌రింంచ‌డంతో పాటు, ఉద్యమంలో కేసీఆర్ స‌మ‌కాలికుల‌ను బీజేపీ టార్గెట్ చేయ‌బోతోంది. మొత్తానికి ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో శంఖారావం పూరిస్తున్న కేసీఆర్ ఎత్తుల‌కు బీజేపి పైఎత్తులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+