హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ కు బీఎల్ సంతోష్ - నయా ఆపరేషన్ షురూ..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో పొలిటికల్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. బీజేపీ అగ్ర నేతలు హైదరాబాద్ కేంద్రంగా కొత్క స్కెచ్ సిద్దం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ పోరు హైకోర్టు ఆదేశాలతో కొత్త టర్న్ తీసుకుంది. ఈ ఎపిసోడ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బీజేపీ ముఖ్యనేతల బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చి విచారణకు ప్రయత్నాలు చేసింది. కానీ, హైకోర్టు ఆ నోటీసుల పైన స్టే ఇచ్చింది. దీంతో, విచారణకు ఆయన రావాల్సిన అసవరం రాలేదు. హైకోర్టు తీర్పు తరువాత..ఇప్పుడు పార్టీ కీలక సమావేశంలో పాల్గొనేందుకు బీఎల్ సంతోష్ హైదరాబాద్ చేరుకుంటున్నారు.

పార్టీ హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెంచేతోంది. ఇప్పటి వరకు కర్ణాటక తరువాత తెలంగాణలోనే పార్టీ బలంగా కనిపిస్తోంది. ఈ బలాన్ని పెంచుకొనేందుకు పార్టీ రెండు రోజుల సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ పార్లమెంట్ విస్తారక్‌ సమావేశం లో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు..ప్రధానంగా తెలంగాణలో వ్యూహాల పైన చర్చించనున్నారు. ఈ సమావేశఆనికి బీఎల్ సంతోష్ తో పాటుగా బీజేపీ అగ్రనాయకులు హాజరౌతున్నారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 87 పార్లమెంట్ నియోజక వర్గాల విస్తారక్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. విస్తారక్‌ల ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, చేరికల కమిటీతో సునీల్ బన్సల్,తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు.

BJP Key Leader BL Santosh to attend party Parilamentary Vistrak meeting at Hyderabad today

పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం బిజెపి తెలంగాణ అసెంబ్లీ ఇంఛార్జిలు, కన్వీనర్‌లు, విస్తారక్, పాలక్‌ల సమావేశం జరగనుంది. ఇప్పటికే ఇతర పార్టీల్లోని కొందరు నేతలతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. వారిని కమలం పార్టీలోకి ఆహ్వానించారు. కొంత మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. త్వరలోనే హైదరాబాద్ వేదిగా పార్టీ జాతీయాక్షుడు నడ్డా ను ఆహ్వానించి ఒక సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ సభలో పార్టీలో చేరికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక, తెలంగాణలో మరో పది నెలల కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఈ సమావేశం నుంచే బీజపీ ముఖ్య నేతలు తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు.

English summary
BJP Key leader BL Santosh to Reach Hyderabad to attend party crucial meetin on Southern states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X