హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!

బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ మరోసారి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని, వారి ఆధారంగా ప్రతిపక్షాన్ని నిర్మూలించే పనిలో పడ్డారని ఆరోపించారు. ఇలాంటి ఆటలు సాగనివ్వబోమన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను పార్టీ ఫిరాయిస్తానంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. అలాంటి పుకార్లను బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూరకంగానే పుట్టిస్తోన్నారని ధ్వజమెత్తారు. తాను మంచి పనులు చేసి, అధికారంలోకి రావడం కంటే- ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికే ప్రాధాన్యత ఇస్తారని మండిపడ్డారు.

చంద్రబాబు కంటే నారా లోకేష్ పది ఆకులు ఎక్కువే చదివాడుగా..!!చంద్రబాబు కంటే నారా లోకేష్ పది ఆకులు ఎక్కువే చదివాడుగా..!!

ఇవ్వాళ ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను పూటకొక పార్టీ, సంవత్సరానికొక జెండా పట్టుకునే రకం కాదని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు. బీజేపీలో తాను ఇమడలేకపోతున్నానని, త్వరలోనే పార్టీ మారుతాడంటూ వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పార్టీ ఫిరాయించిన సందర్భాలు లేవని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు.

BJP leader Etela Rajender slams at Telangana CM KCR and denied the allegations

టీఆర్ఎస్ తనపై లేనిపోని ఆరోపణలు మోపి, పార్టీ నుంచి వెళ్లగొట్టిందని ఆరోపించారు. ఆ తరువాత తనను బీజేపీ అక్కున చేర్చుకుందని, అంతే తప్ప తానేమీ ఉద్దేశపూరకంగానో, సొంత ప్రయోజనాల కోసమో పార్టీలు మారేవాణ్ణి కాదని అన్నారు. కేసీఆర్ మంచిపనులు చేసి జనం మెప్పు పొందడం కంటే రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడం ద్వారా అదికారంలోకి రావడానికి ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీల్లో గందరగోళం సృష్టించి, తన పని నెరవేర్చుకుంటారని ఆరోపించారు. ఆయనకు అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని, వారు ఇచ్చే అంతర్గత సమాచారంతో దెబ్బకొట్టాలని చూస్తుంటారని ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలను కేసీఆర్ ఇలాగే మింగేశారని చెప్పారు. కేసీఆర్ ప్రజాబలానికి బదులుగా, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను నమ్ముకున్నారని మండిపడ్డారు.

కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుని ఆయన రాజకీయాలు చేస్తారని, ప్రలోభాలకు లొంగిపోయే నాయకులను కొనుక్కనే సంస్కృతికి ఆద్యుడు ఆయనేనని ఈటెల ఆరోపించారు. తాను బీజేపీలోకి వచ్చిన తరువాత హుజూరాబాద్ ఎన్నికల్లో తనను ఓడించడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ప్రజలు తనను కడుపులో పెట్టుకున్నారని, వారికి రుణపడి ఉంటానని ఈటెల స్పష్టం చేశారు.

English summary
BJP leader Etela Rajender slams at Telangana CM KCR and denied the allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X