ఎన్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్..!!

బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావును హైదరాబాద్‌ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ఎదుట నిరసన ప్రదర్శనకు బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వట్లేదని తెలంగాణ బీజేపీ ఆరోపిస్తోంది. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నాయకులు హౌస్ అరెస్ట్ అయ్యారు.

131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయమే హైదరాబాద్ పోలీసులు రాంచందర్ రావు నివాసానికి చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు.

BJP leader N Ramchander Rao Under House Arrest In Hyderabad Protest on Women s Reservation Bill

గృహ నిర్బంధంలో ఉంచడాన్ని రాంచందర్ రావు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనను తెలియజేయాలని అనుకున్నామని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తమను అణచివేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. గృహ నిర్బంధాలు తమ గొంతుకను అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. శుక్రవారం సాయంత్రం బీజేపీ యువ మోర్చా నాయకులు హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలను చేపట్టాలని నిర్ణయించింది. లింగ సమానత్వం దిశగా చారిత్రాత్మక ముందడుగును అడ్డుకుందని ఆరోపిస్తూ అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో గల కాంగ్రెస్ కార్యాలయాల ముందు నిరసనలకు దిగుతున్నాయి.

Take a Poll

కాంగ్రెస్.. మహిళా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, అందుకే బిల్లును అడ్డుకుందని ఆరోపిస్తూ ప్రజల మద్దతును కూడగట్టడం, శాసనసభ సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వ నిబద్ధతను తెలియజేయాలనేది బీజేపీ నిరసన ప్రదర్శనల ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా భారీగా ర్యాలీలను నిర్వహించడం, బీజేపీయేతర ముఖ్యమంత్రుల నివాసాల ముందు బైఠాయించడం వంటి ఆందోళనలకు దిగంది బీజేపీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+