హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపికి బిజెపి షాక్: ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి

టిడిపికి షాకిచ్చేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఎల్ బి నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను బిజెపిలో చేరాలని ఆ పార్టీ నేత , మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సంప్రదింపులు జరిపారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపికి షాకిచ్చేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఎల్ బి నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను బిజెపిలో చేరాలని ఆ పార్టీ నేత , మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సంప్రదింపులు జరిపారు.తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తున్న సమయంలోనే ఘటన చోటుచేసుకోవడం ఆసక్తి కల్గిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరించుకొనేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీలకు చెందిన నాయకులతో బిజెపి సంప్రదింపులు చేస్తోంది.

అయితే సోమవారంనాడు ఎల్ బి నగర్ ఆర్. కృష్ణయ్యతో పురంధేశ్వరి సుమారు గంటపాటు సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.కృష్ణయ్యను పార్టీలో చేరాలని ఆమె ఆహ్వానించింది.

Bjp leader Purandeswari met Tdp MLA R. Krishnaiah

అయితే ఈ విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకొంటానని కృష్ణయ్య చెప్పినట్టు సమాచారం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో బిజెపి నాయకులు పార్టీలో చేరికలపై చర్చిస్తున్నారు.

ఈ ఏడాది చివరినాటికి ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరికలు ఉండే అవకాశం ఉంది.అయితే ఈ విషయమై ఇతర పార్టీల నాయకులతో బిజెపి సంప్రదింపులు జరుపుతోంది.అయితే రానున్న రోజుల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.అయితే టిడిపితో పొత్తును గత ఎన్నికల సందర్భంగా బిజెపి నాయకత్వం వ్యతిరేకించింది. అయితే జాతీయ అవసరాల రీత్యా బిజెపి టిడిపితో పొత్తును కుదుర్చుకొంది.

English summary
Former union minister, Bjp leader Purandeswari met Tdp MLA R. Krishnaiah on Monday. she invited him to join in Bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X